ఎవరైనా హీరో తనతో కమిటైతే ఏడాది పైగానే సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని అందుకే ఆ హీరో మరో సినిమా తనతో చేయరని నిర్మాత బన్ని వాసు అన్నారు. ఇంతకుముందు గీత గోవిందం కోసం విజయ్ దేవరకొండ ఏడాది లాక్ అయ్యాడు. ప్రస్తుతం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తెరకెక్కుతుంటే తను కూడా అలానే కాల్షీట్లను కేటాయించాడు.. అని జీఏ2 అధినేత బన్ని వాసు తెలిపారు.
కార్తికేయ హీరోగా కౌశిక్ దర్శకత్వంలో చావు కబురు చల్లగా పాయింట్ విని చాలా ఆలోచించాం. నిజానికి వైష్ణవ్ తేజ్ తో చేయాలనుకున్నాం. కానీ అతడు ఉప్పెన పూర్తయ్యేవరకూ ఏదీ ముట్టుకోనని అన్నాడు. అందుకే కార్తికేయ కలిసినప్పుడు వేరే ఏదీ పెట్టుకోకూడదు ఇది పూర్తయ్యేవరకూ అని అడిగాను. అతడు ఓకే అన్నాకే సినిమా చేశామని బన్ని వాసు తెలిపారు.
చావు కబురు.. పాయింట్ వినగానే నచ్చుతుందా? అనిపించింది. కానీ పూర్తి కథ వినగానే రెగ్యులర్ కథాంశాలకు భిన్నంగా ఉందని అనిపించింది. ప్రేక్షకాదరణ ఉంటుందనే ముందుకెళ్లాం అని తెలిపారు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయని తీసుకుంటే బాగుంటుందని కౌశిక్ చెప్పాడు. నా కండిషన్ కి కార్తికేయ అంగీకరించారు.
చావు కబురు చల్లగాకి గుమ్మడికాయ కొట్టేసినా మళ్లీ మూడు రోజులు షూటింగ్ చేశాం. ఫైనల్ కాపీ చూసి కరెక్షన్స్ చేశామని వాసు తెలిపారు. దేవరకొండ.. అఖిల్ లానే కార్తికేయ కూడా ఈ సినిమా చేస్తూ వేరే ఏ సినిమా చేయలేదని అన్నారు. ఎంచుకునే పాయింట్ క్లాసీగా ఉన్నా మాస్ కి చేరువయ్యేలా చేయాలి. యూనివర్శల్ గా తీయాలి.. అదే నా విజయ రహస్యం అని కూడా బన్ని వాసు తెలిపారు. ఇక ఓటీటీ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని బన్ని విశ్లేషించారు. హీరోల మార్కెట్ పడిపోతుందని అన్నారు. చావు కబురు చల్లగా ఈ నెల 19న విడుదలవుతోంది.