ఈ నెలలో శివరాత్రి సందర్బంగా తెలుగు సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. వాటిలో ముఖ్యంగా జనాల అటెన్షన్ పొందినవి మూడు సినిమాలు. శ్రీకారం, జాతిరత్నాలు, గాలిసంపత్. ఈ మూడు సినిమాలు మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఈ మూడింట్లో జాతిరత్నాలు సూపర్ హిట్ కాగా.. శ్రీకారం మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. కానీ గాలిసంపత్ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ టైటిల్ రోల్ పోషించగా.. శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి. కానీ తీర రిలీజయ్యాక సినిమా బోల్తాకొట్టింది. అనుకున్నది ఒక్కటీ అయింది ఒక్కటీ అన్నట్లుగా గాలిసంపత్.. విడుదలైన ఫస్ట్ డే నుండే కలెక్షన్స్ అంతంత మాత్రంగా నమోదు అయ్యాయి.
రెండో రోజు నుండి కలెక్షన్స్ దారుణంగా మారడంతో చాలా థియేటర్లు గాలిసంపత్ షోలను కూడా రద్దు చేశాయని టాక్. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. గాలిసంపత్ డిజిటల్ హక్కులను ఆహా ఓటిటి దక్కించుకుంది. మార్చ్ 19న డిజిటల్ రిలీజ్ అయింది. మేకర్స్ గాలిసంపత్ సినిమాని వీలైనంత త్వరగా ఆహాకు అమ్మేసుకున్నారు. థియేట్రికల్ రిలీజైన ఎనిమిది రోజులకే గాలిసంపత్ ఆహాలో విడుదలైంది. అయితే అనూహ్యంగా ఆహాలో గాలిసంపత్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి డిజిటల్ రిలీజ్ ద్వారా గాలిసంపత్ సినిమాను ఆహా వారు జనాలముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసాడు.