రాజేంద్ర ప్రసాద్.. శ్రీవిష్ణు కీలక పాత్రల్లో నటించిన గాలి సంపత్ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గత వారం వచ్చిన మూడు సినిమాల్లో రెండు పాజిటివ్ టాక్ ను దక్కించుకోగా ఈ సినిమా ను మాత్రం జనాలు తిరష్కరించారు. థియేటర్లలో జనాలు లేకపోవడంతో వారం గడవక ముందే ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సరిగ్గా వారం రోజులకే ఓటీటీ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాలి సంపత్ సినిమా గురించి నిన్న మొన్నటి వరకు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కనుక గాలి సంపత్ ఓటీటీ లో అనగానే జనాలు ఎగబడి చూస్తారని కాస్త ఎక్కువ మొత్తం పెట్టి కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది.
ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా మొదట ఆహా వారు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ వారు కూడా దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పద్దతి అరుదుగా చూస్తూ ఉంటాం. ఒక సినిమాను రెండు ఓటీటీలు ఒకేసారి స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గాలి సంపత్ ను కూడా నేటి నుండి ఆహా మరియు అమెజాన్ వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక దాని నుండి తొలగించి ఒక దాంట్లో పర్మినెంట్ గా కంటిన్యూ చేస్తారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కోసం ఇలా రెండు ఓటీటీల ద్వారా స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు.