శాండల్ వుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ లాంగ్వేజ్ మూవీ కెజిఫ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. భారీ సినిమాల పోటీ మధ్య వస్తున్నా క్రేజ్ విషయంలో ధీటు గా నిలుస్తున్న ఈ మూవీ ఇప్పటికే రెండు ట్రైలర్ల ద్వారా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకట్టుకుంది. ప్రమోషన్ లో భాగంగా గలి గలి అనే ఐటెం సాంగ్ విడుదల చేసారు. టీవీ సీరియల్స్ ద్వారా సుపరిచితురాలై సోషల్ మీడియాలో హాట్ పిక్స్ మోడలింగ్ ద్వారా యమా పాపులర్ అయిన మౌని రాయ్ ఇందులో నర్తించడంతో రసిక ప్రియులు దీని మీద ఓ కన్నేశారు. లిప్ సింక్ చూస్తుంటే స్ట్రెయిట్ గా హిందీ వెర్షన్ లోనే షూట్ చేసినట్టు ఉన్నారు.
పాట విషయానికి వస్తా మౌని రాయ్ ఆశించిన మేజిక్ ఇందులో చేయలేదనే చెప్పాలి. సాధారణంగా ఇలాంటి పాటల్లో ఉండాల్సిన మసాలా కాస్ట్యూమ్స్ అన్ని మౌని ఫాలో అయినప్పటికీ కీలకమైన డాన్స్ గ్రేస్ మూవ్మెంట్స్ మిస్ కావడంతో అంత కిక్ ఇవ్వలేకపోయింది. యాష్ చేసిన యాక్షన్ బిట్స్ మధ్యలో చూపిస్తూ ఓ పబ్ లో సాగుతూ ఉండే ఈ పాట రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో సాగే కెజిఎఫ్ లో యాష్ అట్టడుగు స్థాయి నుంచి బంగారం మాఫియాను శాశించే స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే పాయింట్ మీద రూపొందింది.
రెండు భాగాల సిరీస్ లో ఇది మొదటిది. సీక్వెల్ వచ్చే ఏడాది ప్లాన్ చేసారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన కెజిఎఫ్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ఆశిస్తున్నారు. తెలుగులో పడి పడి లేచే మనసు-అంతరిక్షం రూపంలో తీవ్రమైన పోటీ ఉండటంతో కెజిఎఫ్ నడక అంత సులభంగా అయితే ఉండదు
Full View