టాలీవుడ్ బిగ్ గ్యాంబ్ల‌ర్ క‌హానీ!!

Update: 2018-12-24 10:23 GMT
ఏషియ‌న్ సునీల్ నారంగ్ .. ప‌రిచయం అవ‌స‌రం లేని నామ‌ధేయ‌మిది. ఇండ‌స్ట్రీ బిగ్ డిస్ట్రిబ్యూట‌ర్ గా, ఫైనాన్షియ‌ర్ గా అంద‌రికీ సుప‌రిచితుడు. తండ్రి నుంచి వ‌చ్చిన వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని నాలుగు ద‌శాబ్ధాల హిస్ట‌రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న బిగ్ టాలీవుడ్ బిజినెస్ మేన్. రియ‌ల్ ఎస్టేట్‌ రంగం స‌హా సినిమా థియేట‌ర్ల వ్యాపారంలోనూ ఆయ‌న ఎంతో పెద్ద జియాంట్ గా ఎదిగారు. భాగ‌స్వాముల‌తో క‌లిసి ఏషియ‌న్ సినిమాస్ సామ్రాజ్యాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అత‌డు ఇండ‌స్ట్రీ బిగ్ బీలంద‌రితో క‌లిసి భారీ వెంచ‌ర్ల‌ను ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు ఏఎంబీ సినిమాస్ పేరుతో మ‌హేష్‌తో కలిసి భారీ వెంచ‌ర్లు వేస్తున్నారు. మ‌రోవైపు డి.సురేష్ బాబుతో క‌లిసి ఏషియ‌న్ సినిమాస్ పేరుతో ఎంతో పెద్ద థియేట‌ర్‌ గేమ్ సెట‌ప్ చేశారు. ఇదే గాక అల్లు అర‌వింద్- అల్లు అర్జున్ ద్వ‌యంతో క‌లిసి భారీగా మ‌ల్టీప్లెక్సుల నిర్మాణానికి శ్రీ‌కారం చుడుతున్నారు. ఈ కాంబో అమీర్ పేట్ స‌త్యం థియేట‌ర్ ఏరియా స‌హా ప‌లు చోట్ల భారీ మాల్స్ నిర్మాణం చేయ‌నున్నారు. ఎడ‌తెగ‌ని బిజినెస్ సామ్రాజ్యంలో అలుపెర‌గ‌ని యోధుడిగా ఏషియ‌న్ నారంగ్ పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లుతున్నారు.

అయితే బిజినెస్ రంగంలో అప్స్ & డౌన్స్ ని ఆయ‌న ఎలా ఎదురొడ్డి పోరాడుతున్నారు? అంటే త‌న‌కు పోటీగా ఉన్న సాటి బిజినెస్ మేన్ ల‌తో ఈ రంగంలో పోటీప‌డుతూ ఆయ‌న నెగ్గుకొస్తున్న వైనంపైనా క‌థ‌నాలెన్నో వ‌స్తున్నాయి. ఇదివ‌ర‌కూ ఆయ‌న దిల్ రాజు లాంటి అగ్ర పంపిణీదారుడిని వెన‌క్కి నెట్టి సినిమాల్ని త‌న ప‌రం చేసుకోవ‌డం పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అస‌లింత‌కీ నైజాంలో ఆయ‌న వ్యాపార సామ్రాజ్యం ఎంతో తెలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మ‌డం ఖాయం. నైజాంలో ఏషియ‌న్ నారంగ్‌కి ఏకంగా 150 థియేట‌ర్లు ఉన్నాయి. ఫైనాన్స్, పంపిణీలో కింగ్ ఆయ‌న‌.

అయితే ఆ న‌లుగురిలో లేదా ఆ ఐదోవాడిగానో అత‌డు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్త‌రించ‌గ‌ల‌గ‌డానికి కార‌ణం థియేట‌ర్ల‌ను గుప్పిట్లో పెట్టుకుని ఆడించ‌డ‌మేనా? అంటూ ప‌లువురు ప‌లుమార్లు ఆయ‌న‌నే ప్ర‌శ్నించారు. దానికి ఆయ‌న స‌మాధానం అంతే ఘాటుగానూ ఉంటోంది. థియేట‌ర్లు గుప్పిట్లో పెట్టుకుని మేం డ్యాన్సులేవైనా ఆడ‌తామా? అంటూ సీరియ‌స్ అవుతున్నారాయ‌న‌. ``అవ‌న్నీ బేకార్ మాట‌లు.. రిలీజ్‌కి వ‌చ్చే ప్ర‌తి సినిమాని మా థియేట‌ర్ల‌లో వేస్తున్నాం.... ఆడిస్తున్నాం. బావున్న‌వి ఆడుతున్నాయి. బాగోలేనివి పోతున్నాయి.. అని చెబుతున్నారు. ఒకేసారి ఐదారు సినిమాలు రిలీజ్‌ల‌కు వ‌స్తే ఏం చేయాలి?  మెగాస్టార్ సినిమాని ముందు వేస్తామా?  వేరే అంత‌గా ప్రాధాన్య‌త లేని చిన్న సినిమాలు వేస్తామా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ఒక్క‌రూ పండ‌గ‌ల‌కు మాకు థియేట‌ర్లు కావాల‌ని పోటీకొస్తుంటారు. ఒకేసారి ఐదారు సినిమాలు వ‌స్తుంటాయి. వాటిలో వేటిని వేయాలి?  ప్రాధాన్య‌త ఉండ‌దా?   దాని ప్ర‌కార‌మే వేస్తున్నాం.. అని అన్నారు. ఈ విష‌యంలో ఇండ‌స్ట్రీని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.
   

Tags:    

Similar News