కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా 'గంధద గుడి' ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. పునీత్ మరణం తర్వాత రిలీజ్ అవుతోన్న సినిమా ఇది. దీంతో కుటుంబ సభ్యులు..అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని భావిస్తున్నారు. సినిమాని హిట్ చేసి ఘనమైన నివాళీ అందించాలని అభిమానులు కంకణం కట్టుకున్నారు.
పునిత్ సేవలకు గుర్తుగా ఈ సినిమా ఫలితం నిలిచిపోవాలని ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా పునీత్ కెరీర్ లో ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. కమర్శియల్ నటుడిగా ఎన్నో సినిమాలు చేసారు. మరెన్నో తెలగు రీమేక్ చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగారు. కానీ గంధద గడి వాటికి భిన్నమైన సినిమా. పునిత్ లో ప్రకృతి ప్రేమికుడ్ని...పక్షుల ప్రియుడ్ని పరిచయం చేస్తుందని చెప్పొచ్చు.
కర్ణాటక రాష్ర్టమంతా తిరిగి అరుదైన పక్షులు..జంతువులు..సరిసృపాలు చిత్రీకరించారు. అడవిలో అందమైన ప్రకృతి అందాల నేచుర్ ని మరింత అందంగా మలిచినట్లు తెలుస్తోంది. వాటితో పునీత్ మమేకమైన విధానాన్ని ఎంతో అద్భుతంగా విజువల్ వండర్ గా మలిచి డాక్యుమెంటరీ రూపంలో రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో కథంటూ ఏమీ ఉండదు.
ప్రకృతిని మాత్రమే హైలైట్ చేసి చూపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూట్ అంతా పునీత్ కి గుండె పోటు రావడానికి ముందే పూర్తి చేసారు. ఇటీవలే డాక్యుమెంటరీ ట్రైలరని పునీత్ భార్య రిలీజ్ చేసారు. ఆరోజుని ఎమోషనల్ డేగా వర్ణించారు. అప్పూకి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. తన హృదయానికి దగ్గరైన ప్రాజెక్ట్ ఇది. ఆయన ఇప్పటికీ మా మనసుల్లో ఉన్నారు అని ట్వీట్ చేయగా..దానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేసారు. పునీత్ అసామానమైన ప్రతిభావంతుడని కొనియాడారు.
పృకృతి అందాల్ని బీబీసీ..డిస్కవరీ లాంటి అంతర్జాయతీ ఛానెల్స్ ఎంతో అద్భుతంగా..అందంగా కవర్ చేస్తుంటాయి. ప్రకృతిని బేస్ చేసుకుని ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఎప్పటికప్పుడు కొత్త అనుభూతినే అందిస్తాయి.
ఆ కోవలో పునిత్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ప్రేక్ష కులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని అభిమానులంతా భావిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆక్టోబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిలీజ్ బాధ్యతలు అన్నింటిని పునిత్ సతీమణి ..కుటుంబ సభ్యులంతా దగ్గరుండి చూసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.