బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు సాయి శ్రీనివాస్ ఇప్పటికే యాక్షన్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాక్షసుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి వరుస చిత్రాలకు సంతకాలు చేశాడు. ప్రస్తుతం హిందీలో ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్న సంగతి విధితమే. అతడి సోదరుడు బెల్లంకొండ గణేష్ హీరోగా లక్కీ మీడియా - దిల్ రాజు కలయికలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పవన్ సాధినేని దర్శకుడిగా ఇది మొదలైంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు సంతకాలు చేస్తున్నాడు.
నేడు బ్లాక్ బస్టర్ `నాంది` చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ ఎస్వీ2 ఎంటర్ టైన్ మెంట్స్ లో గణేష్ నటించే మూడో సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు క్లాప్ కొట్టి ప్రారంభించగా అల్లరి నరేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కార్యక్రమంలో బెల్లంకొండ గణేష్- లిరిసిస్ట్ కృష్ణచైతన్య సహా చిత్రబృందం పాల్గొన్నారు.
ఇది న్యూ ఏజ్ థ్రిల్లర్ జానర్ అని చిత్రబృందం వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్ కు రాకేశ్ స్క్రీన్ ప్లే రాయగా కథను అందించిన ప్రముఖ రచయిత కృష్ణ చైతన్య మాటలు పాటలను కూడా రాస్తున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అనిత్ సినిమాటోగ్రాఫర్. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్. అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ స్టైల్లోనే గణేశ్ కూడా కెరీర్ ప్రారంభంలోనే వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు.