పటాస్‌ రీమేక్‌లో పెద్ద హీరోనే..

Update: 2015-05-23 22:30 GMT
ఈ ఏడాది టాలీవుడ్‌లో అతి పెద్ద హిట్టు ఏదంటే కచ్చితంగా పటాస్‌ సినిమానే. పెట్టుబడికి రెట్టింపు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది కళ్యాణ్‌ రామ్‌ సినిమా. పటాస్‌ సాధించిన విజయం చూసి పక్క ఇండస్ట్రీల వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే వచ్చి రీమేక్‌ రైట్స్‌ పట్టుకుపోయారు. తమిళంలో ఆర్‌.బి.చౌదరి రీమేక్‌ రైట్స్‌ తీసుకుని లారెన్స్‌ హీరోగా సినిమా తీయడానికి రెడీ అయిపోతుంటే.. మరోవైపు కన్నడ రీమేక్‌కు కూడా రంగం సిద్ధమైపోయింది. అక్కడ గోల్డెన్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన గణేష్‌ కథానాయకుడిగా పటాస్‌ రీమేక్‌ చేయబోతున్నారు.

ముంగారమలైతో కథానాయకుడిగా స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న గణేష్‌.. వరుస హిట్లతో గోల్డెన్‌ స్టార్‌ అయిపోయాడు. యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్టైనర్‌లు తీయడంలో మంచి పేరున్న మంజు స్వరాజ్‌ పటాస్‌ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఐతే ఉన్నదున్నట్లు దించేయకుండా కన్నడ ఆడియన్స్‌ టేస్టుకు తగ్గట్లు మార్పులు చేయబోతున్నాడట మంజు స్వరాజ్‌. ప్రస్తుతం స్క్రిప్టును తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌ మీదికి వెళ్తుంది. తమిళం కంటే కూడా కన్నడ నిర్మాత ఫ్యాన్సీ రేట్‌ ఇచ్చి 'పటాస్‌' రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నాడు. అతను సెట్‌ చేస్తున్న కాంబినేషన్‌ చూస్తుంటే 'పటాస్‌' తెలుగులో కంటే కన్నడలో పెద్ద హిట్టే అయ్యేలా ఉంది.
Tags:    

Similar News