ప్రస్తుతం హారర్ ట్రెండు నడుస్తోంది. భయపెట్టే సినిమాలకు గిరాకీ పెరుగుతోంది. అందుకే వరుస పెట్టి హారర్ సినిమాలు టాలీవుడ్‌ని దండెత్తుతున్నాయి. ప్రేమకథా చిత్రమ్ మొదలు నిన్నటి కాలింగ్ బెల్, చిత్రమ్ కాదు నిజమ్ వరకూ ప్రతిదీ హారర్ జోనర్‌లో తెరకెక్కినవే. హారర్ రొమాన్స్ కలిపితే థ్రిల్లింగే అన్న ఆలోచనతో మన దర్శకులంతా సతమతమవుతున్నారు. అందుకే ఇలాంటి సినిమాల్ని జనాల మీదికి వదులుతున్నారు.
అయితే అప్పట్లో లారెన్స్ ముని అనే చిత్రంతో ఈ ట్రెండ్ మొదలెట్టాడు. ముని యావరేజ్ అనిపించుకున్నా... దానికి కొనసాగింపుగా తెరకెక్కించిన 'కాంచన' బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 3ని తెరకెక్కించాడు ఇప్పుడు. కాంచన 2 అంటూ పేరు పెట్టాడు. దీనిని తెలుగులో గంగ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలెట్టిన ముహూర్తం బాలేదో ఏమో ఏకంగా రెండున్నరేళ్లు పైగానే ఎదురు చూడాల్సొచ్చింది. బహుభాషా చిత్రం అవ్వడం, విజువల్ గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్‌తో పని అవ్వడం వల్ల ఈ సినిమా బాగా ఆలస్యమైంది. పైగా మధ్యలో మరిన్ని ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టాయి.
ఏదేమైనా ఎలాగోలా ఈ సినిమా పూర్తయి చివరికి రిలీజవుతోంది. ఈనెల 17 రిలీజ్ అని లారెన్స్ స్వయంగా ప్రకటించాడు. మరి గంగ తర్వాత గంగ 2 ఉంటుందా? అన్న ప్రశ్నకు అబ్బే అలాంటిదేం లేదు అని చెబుతున్నాడు. గంగ దెబ్బకి బెంబేలెత్తాడా? అని జోకులేసుకుంటున్నారంతా. లేదా మనసు మార్చుకుని థ్రిల్లర్ల జోలికి రాకూడదనుకుంటున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది.