ప్రతిభను ఎవరూ దాచలేరు. మారుమూల గ్రామాల నుంచి సైతం ప్రతిభావంతులు సోషల్ మీడియా- డిజిటల్ యుగంలో నిరూపించుకుంటున్నారు. బయట ఫోకస్ చాలా సులువుగా వచ్చేస్తోంది. ఇంతకుముందు పల్లె కోకిల బేబీ గానామృతానికి సెలబ్రిటీ ప్రపంచం తో పాటు సామాన్యులు మంత్రముగ్ధులయ్యారు. మెగాస్టార్ స్వయంగా ఇంటికి పిలిపించుకుని సతీసమేతుడై తన గానామృతాన్ని ఆస్వాధించడమే గాక.. తన ప్రతిభకు మురిసి లక్షల్లో ఆర్థిక సాయం అందించారు. వెటరన్ సంగీత దర్శకుడు కోటి ఏకంగా తనని పెద్ద సెలబ్రిటీగానే మార్చేసి సినిమాల్లో పాడే అవకాశం కల్పించారు.
ఇక ఇదే తరహాలో నేచురల్ యాంకర్ గంగవ్వ యూట్యూబ్ చాట్ షోలకు అంతే వీరాభిమానులు ఏర్పడ్డారు. నైజాం యాసతో గంగవ్వ చేసే సందడి మామూలుగా ఏం ఉండదు. తను షోలో ఎంటరైతే సందడే సందడి. ఇక రెగ్యులర్ గా రిలీజవుతున్న సినిమాలకు గంగవ్వ ఓ వరంలా మారింది. ప్రచారానికి బోలెడంత సాయం చేస్తోంది. ఈ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ వేడుకకు విచ్చేసిన గంగవ్వ విజయ్ ని నా కొడుకు అంటూ ఎంతో ఆప్యాయతను కనబరిచింది. కొడుకు సినిమా హిట్టు కావాలని ఆశీర్వదించింది అవ్వ.
ముఖానికి ఉబ్బెత్తుగా మేకప్ లు వేసుకుని యాంకర్లు చేసే ప్రచారం కంటే గంగవ్వ ప్రచారమే సినిమాలకు బాగా కలిసొస్తోంది. అందుకే తను పెద్ద సెలబ్రిటీ అయ్యింది. తనకంటూ ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ అండను చూపించి అవ్వ ఏమందో తెలుసా? నాకు ఫ్యాన్సున్నారు జాగ్రత్త! అంటూ సరదాగా హెచ్చరికను జారీ చేసి అందరినీ నవ్వించింది. వరల్డ్ ఫేమస్ లవర్ కి లక్కీ అవ్వ బ్లెస్సింగ్ ఏమేరకు కలిసొస్తుందో చూడాలి. ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజవుతోంది.