ఖైదీ ఫంక్షన్.. రంగంలోకి టిడిపి మంత్రి

Update: 2017-01-02 04:00 GMT
మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ విషయంలో నానా హంగామా నడుస్తోంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తామని.. రామ్ చరణ్ స్వయంగా అభిమానులను ఆహ్వానించాడు. కానీ పర్మిషన్స్ ఇచ్చేది లేదని తేల్చేసిందట ఏపీ ప్రభుత్వం. అందుకు కారణంగా గతంలో హై కోర్టు ఈ గ్రౌండులో స్పోర్ట్స్ కు తప్పించి వేరే యవ్వారాలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించకూడదని చెప్పిన ఆర్డర్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మనకు కూడా ఆల్రెడీ తెలిసిందే కాని.. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే పర్మిషన్ ఇవ్వొచ్చు.

ఇదంతా చూస్తున్న మెగా ఫ్యాన్స్ బాలయ్య మూవీ గౌతమీపుత్ర శాతకర్ణికి సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. గత నెలలో ఆడియో వేడుకకు అడ్డు పడడం.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వకపోవడం కూడా అందులో భాగంగానే చెబుతున్నారు. ప్రస్తుతం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను విజయవాడ నుంచి గుంటూరు తరలిస్తారనే టాక్ ఉంది. అయితే చిరంజీవి ఫంక్షన్ కు ఇక్కడ కూడా అనుమతుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయట. ఇప్పటికే ఈ విషయంపై టీడీపీ వర్గాలతో చిరుకు చాలా క్లోజ్ అయిన తెలుగుదేశం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఖైదీ నంబర్ 150 కి సంబంధించిన ఈవెంట్ జరగకుండా చేయాలని తెరవెనుక ప్రయత్నాలు ఏమైనా తెలుగు తమ్ముళ్ళు చేస్తుంటే కనుక.. అవన్నీ వారు విరమించుకోవాలని గంటా చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే విజయవాడ.. గుంటూరుల్లో సాధ్యం కాకపోతే హైద్రాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ ఉపయోగించుకోమని.. రామ్ చరణ్ కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సందేశం పంపినట్లు కూడా టాక్ వస్తోంది. గతంలో ''ధృవ'' ఈవెంట్ కూడా ఇక్కడే చేశారు. ఇక మంత్రి గంటా మాత్రం.. అన్ని కార్యక్రమాలు హైదరాబాద్ లో అంటే ఎలా.. ఒకవేళ విజయవాడ కాకపోతే కమ్ టు వైజాగ్ అంటున్నారట. గతంలో ఆయన ఆధ్వర్యంలో సరైనోడు వంటి సినిమాల ఈవెంట్లు వైజాగ్ లోనే జరిగాయ్. చూద్దాం మరేం జరుగుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News