'ఫిదా' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి.. తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అందం - అభినయం - డ్యాన్సులతో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ ప్రారంభం నుంచీ గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది.
అందుకే చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది 'లవ్ స్టోరీ' 'శ్యామ్ సింగరాయ్' సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ రెండు విజయాలు అందుకున్న సాయి పల్లవి.. త్వరలో 'విరాటపర్వం' చిత్రంతో పలకరించబోతోంది. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో ''గార్గి'' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో రాబోతోంది.
నేడు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ మరియు మేకింగ్ వీడియో గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 'గార్గి' సినిమా గురించి చెప్పడానికి కొన్ని నెలలుగా ఆసక్తిగా వేచి చూస్తున్నాను. ఫైనల్లీ నా బర్త్ డే నాడు ఈ గ్లింప్స్ రిలీజ్ చేయాలని టీమ్ డిసైడ్ చేసింది అని పల్లవి సోషల్ మీడియాలో పేర్కొంది.
'గార్గి' చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాయి పల్లవి ఎప్పటిలాగే సాంప్రదాయక చీర కట్టుతో భుజాన ఒక బ్యాగ్ తగిలించుకుని సాధారణ యువతిగా కనిపిస్తోంది. ఆమె దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఇంటెన్స్ గా చూస్తోంది. బ్యాగ్రౌండ్ లో న్యాయదేవతను కూడా మనం గమనించవచ్చు.
మేకింగ్ వీడియోలో 'నువ్వు టైమ్, రాత, విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే నేను మగపిల్లాడిని కాదుగా, ఆడపిల్లను' అని సాయి పల్లవి డబ్బింగ్ చెప్పడం కనిపిస్తోంది. 'గార్గి' ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ చూస్తుంటే.. ఇది అందరినీ ఎదిరించి న్యాయం కోసం పోరాటం చేసే ఓ మహిళ కథేమో అనే ఆలోచన వస్తోంది. అంతేకాదు సాయి పల్లవి మరో విలక్షణమైన పాత్రతో అలరించబోతోందని అర్థం అవుతుంది.
Full View

''గార్గి'' చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాకీ జనీ బ్యానర్ పై రవి చంద్రన్ రామచంద్రన్ - ఐశ్వర్య లక్ష్మీ - థామస్ జార్జ్ - గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.