సీనియర్ హీరో రాజశేఖర్ కు సక్సెస్ వచ్చి చాలా కాలమే అయింది. ఇక తన కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే అని ఆయన కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయి.. విలన్ వేషాలకు సిద్ధమవుతున్న సమయంలో వచ్చిన మూవీ పీఎస్వీ గరుడవేగ. ముందు నుంచి ఈ చిత్రం బడ్జెట్ ఆశ్చర్యం కలిగించగా.. రిలీజ్ ముందు బజ్.. రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ అద్భుతం అనాల్సిందే.
అయితే.. గరుడవేగకు వచ్చిన టాక్ కు తగినట్లుగా కలెక్షన్స్ లేవు. థియేట్రికల్ రైట్స్ నే దాదాపు 11 కోట్లకు విక్రయించారనే టాక్ ఉంది. కానీ ఈ మూవీ ప్రొడ్యూసర్ కోటేశ్వరరాజు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. మంచి సినిమాను తీశాడనే పేరు అయితే వచ్చింది కానీ.. మనిషి మాత్రం కనిపించడం లేదు. ట్రైలర్ లాంఛ్ సమయంలో ఓ సారి హీరో రాజశేఖర్ తో పాటు కాసేపు మెరిసిన కోటేశ్వరరాజు.. ప్రమోషన్స్ లో కానీ.. సక్సెస్ మీట్ లో కానీ కనిపించడం లేదు. ఈ చిత్రానికి 17 కోట్ల మేర ఖర్చు పెట్టారనే టాక్ ఉంది. మూవీ బడ్జెట్ పెరిగిపోవడంతో.. ఓ స్థాయిలో ఈ నిర్మాత చేతులెత్తేశాడని.. సినిమాను పూర్తి చేయడం.. రిలీజ్ చేయడం వంటి వ్యవహారాలను రాజశేఖర్-జీవితలే చూసుకున్నారనే టాక్ ఉంది.
ఈ టాక్ వచ్చిన తర్వాత సినిమా గురించి పట్టించుకున్నదీ.. రిలీజ్ సమయంలో యాక్టివ్ గా వ్యవహరించింది కూడా వీరే. ఇప్పుడు కలెక్షన్స్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో.. ఈ నిర్మాత దాదాపుగా సైడ్ అయిపోయారని అంటున్నారు.