పాత జ్ఞాపకాలు ఒక్కోసారి మనసును నిలవనీయవు. పదే పదే స్ఫురణకు వస్తుంటాయి. అలాంటి ఒక రేర్ మెమరీని తవ్వి తీశారు నమ్రత శిరోద్కర్. తాజాగా ఇన్ స్టాలో తన అభిమానుల కోసం ఒక ఆసక్తికర రోడ్ ట్రిప్ గురించి వెల్లడించారు.
కొన్నేళ్ల క్రితం స్విట్జర్లాండ్ లోని అందమైన కొండ కోనల్లో మహేష్ బాబుపై ఒక పాట చిత్రీకరణ జరుగుతోందట. అయితే అక్కడికి వెళ్లాల్సి వస్తే తాము (నమ్రత - గౌతమ్) రోడ్ ట్రిప్ లో మహేష్ ని డ్రాప్ చేసి వెళ్లారట. అది ఎంతో మరపురాని అనుభూతిగా మిగిలిందని ఒక అందమైన ఫోటోని షేర్ చేశారు నమ్రత. స్విట్జర్లాండ్ లో కొండల దిగువన ఉన్న నది వద్ద నమ్రత- గౌతమ్ ఫోటో దిగారు. చాలా కాలం నాటి ఫోటో ఇది. గౌతమ్ కి మూడు నాలుగేళ్లప్పుడు వెళ్లి ఉండొచ్చు. అన్ ఫర్ గెటబుల్ రోడ్ ట్రిప్ అంటూ ఈ ఫోటోతో పాటు లవ్ ఈమోజీల్ని షేర్ చేశారు.
స్విస్ డైరీస్ .. వే బ్యాక్ వెడ్నెస్ డే.. వన్ ఫర్ ఈజ్ డే అంటూ రకరకాల హ్యాష్ ట్యాగులతో ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఇది నిజంగా నమ్రత ఇన్ స్టా ఆల్బమ్ లో వెరీ రేర్ ఫోటో. జ్ఞాపకాల్లోనూ అరుదైన సాహసయాత్ర అనొచ్చు. ప్రస్తుతం మహేష్ సర్కార్ వారి పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇంతకుముందు దుబాయ్ లో షూటింగ్ స్పాట్ కి నమ్రత- గౌతమ్- సితార బృందం వెళ్లారు. అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ ని ఎంజాయ్ చేశారు.