కొన్ని రోజుల క్రితం వచ్చిన ఒక వార్త చాలామందికి షాకిచ్చింది. ఈ వయసులో లోకనాయకుడు కమల్ హాసన్ - సీనియర్ నటి గౌతమి విడిపోతున్నారని. దీంతో సుమారు 14 ఏళ్లుగా సహజీవనం చేసిన వారు ఈ వయసులో ఒకరికొకరు దూరం అవడానికి కారణం ఏమిటై ఉంటుందా అని నలుగురూ నాలుగు రకాలుగా చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. వారు కారణం అని - వీరు కారణం అని - పిల్లలే కారణం అని ఇలా ఎవరి తోచిన గాసిప్పులు వారు చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాలపై నటీ గౌతమి క్లారిటీ ఇచ్చారు.
కమలహాసన్ - గౌతమిలు విడిపోవడానికి నటి శ్రుతీహాసన్ - అక్షరహాసన్ లే కారణం అనీ.. వారి తండ్రితో గౌతమి సహజీవనం చేయడం వారికి ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే వారే వీరిని విడదీశారాని ప్రచారం హల్ చల్ చేస్తోంది. ఈ ప్రచారం లోకమంతా తిరిగి చివరికి గౌతమి చెవిని కూడా తాకిందో ఏమో కానీ... ఈ విషయాలపై గౌతమి స్పందించారు. "నెను - కమల్ విడిపోవడానికి కమలహాసన్ కూతుళ్లు శ్రుతీహసన్ - అక్షరహాసన్ లు కారణం కాదు" అని గౌతమి పేర్కొన్నారు. తాను సమాజంలో ఒక సెలబ్రిటిగా జీవిస్తున్నందువల్ల తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బహిరంగ పరచాల్సిన బాధ్యత తనపై ఉంటుందనీ అన్నారు.
జీవితంలో మార్పు అవసరం అనీ - కాలం తీసుకొచ్చే కొన్ని మార్పుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందనీ.. ఈ సమయంలో తన కూతురు భవిష్యత్ తనకు చాలా ముఖ్యం అని అన్నారు. ఈ సమయంలో తన కూతురు భవిష్యత్ కూడా తాను కమలహాసన్ కు దూరం అవడానికి కారణం అని పేర్కొన్నారు గౌతమి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/