లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ - గౌతమి మధ్య రిలేషన్ ఏంటన్నది తెలిసిందే. ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ.. ఆ తర్వాత సహజీవనం ద్వారా ఒక్కటయ్యారు. మొదటి భార్య సారికతో విడిపోయిన తర్వాత గౌతమికి దగ్గరయ్యారు కమల్. చాలా కాలంపాటు కలిసి సహజీవనం చేసిన వీరు.. ఆ మధ్య విడిపోయారు.
తనకూ కూతురు ఉందని, ఆమె బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు గౌతమి. అయితే.. ఎందుకు విడిపోతున్నామనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. శృతిహాసన్ వల్లే వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత బీజేపీలో చేరారు గౌతమి.
ఇప్పుడు తమిళనాట ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడేళ్ల కింద పార్టీ పెట్టిన కమల్.. తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమను అధికారంలోకి తీస్తే.. రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు.
దీనిపై గౌతమి స్పందించారు. ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కమల్ హాసన్ తెస్తానని చెబుతున్న మార్పును ప్రజలు కోరుకుంటున్నారా? లేదా? అన్నది మే 2న తేలిపోతుందని అన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు కమల్ మార్కెటింగ్ మాయజాలం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని ప్రజలు నమ్మడానికి సిద్దంగా లేరని అన్నారు. కమల్ పై గౌతమి సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది.