‘ఖైదీ’.. ‘శాతకర్ణి’ ఎవరినేం చేశాయి?

Update: 2017-01-13 08:55 GMT
పోటాపోటీగా ఇద్దరు అగ్రహీరోల సినిమాలు రోజు తేడాతో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల్ని అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి.. రిలీజ్ డేట్ ప్రకటించే వరకూ కూడా ఏ సినిమాకు ఆ సినిమాకులభించిన ప్రచారం అంతాఇంతా కాదు. అన్నింటికి మించి.. ఇద్దరు అగ్రహీరోల కెరీర్ కు.. వ్యక్తిగతంగానూ మైల్ స్టోన్ లాంటి చిత్రాలు ఒకేసారి పందెం కోళ్ల మాదిరి మారి సంక్రాంతి బరిలోకి రావటంతో.. ఇరువర్గాల అభిమానుల మధ్యన ఉద్వేగాల్ని రగిలించిందన్నది సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న పోస్టుల్ని చూస్తేనే అర్థమవుతుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక ఈ సినిమాలతో సంబంధం ఉన్నవారు.. సంబంధం లేని వారు ఊహించని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఈ ఆసక్తికరమైన ముచ్చట్లను చూస్తే..

చిరంజీవి – బాస్ ఈజ్ బ్యాక్ అన్నది అక్షరాల నిజమైంది

బాలకృష్ణ – శాతకర్ణి లాంటి సినిమాలు ఆయనకే సాధ్యమని నిరూపించారు

వినాయక్ – అన్నయ్య నమ్మకాన్ని నిజం చేసినా.. విమర్శకుల మనసుల్ని గెలుచుకోలేకపోయారు

క్రిష్ – ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. శాతకర్ణి మరో ఎత్తు. అగ్రహీరో చిత్రాన్ని డైరెక్టర్స్ మూవీగా మార్చేశారు.

కాజల్.. శ్రియ – వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్న విషయాన్ని సైలెంట్ గా చెప్పేశారు. అందాలతో మనసుల్ని దోచేశారు.

రాజమౌళి – శిల్పాల్ని చెక్కాలే కానీ సినిమాను కాదన్న విమర్శను మూటగట్టుకున్నారు

నాగబాబు – అన్నయ్య లా కూల్ గా దెబ్బేయకుండా ఈ అనవసరమైన ఆవేశం ఎందుకంటా? అన్న మాట వచ్చేలా చేసుకున్నారు

వర్మ – ఎవరినైనా సరే.. ఎంత మాట అయినా అనేస్తా.. నా దారి నాదే. నన్ను ఎవరన్నా వదిలిపెట్టనన్నట్లు వ్యవహరించారు

బుర్రా సాయి మాధవ్ – టాలీవుడ్ కు సరికొత్త మాటల మాంత్రికుడిగా అవతరించారు

 బాక్స్ ఫీస్ – అగ్రహీరోలు ఇద్దరూ కలిసి బద్ధలు కొట్టేశారు

నిర్మాతలు – పెట్టిన పెట్టుబడి భారీ రిటర్న్స్

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News