గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి.. తెలుగు సినిమా రిలీజ్ లలో భారీ పోటీ నెలకొంది. చిరంజీవి కం బ్యాక్ మూవీ.. బాలకృష్ణ వందోచిత్రం ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతుండడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్లు.. ఇప్పుడీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారని తెలుస్తోంది.
ఖైదీ నంబర్ 150కి ఏషియన్ డిస్ట్రిబ్యూషన్.. సుధాకర్ రెడ్డి అండగా ఉంటే.. గౌతమిపుత్ర శాతకర్ణికి సురేష్ బాబు సపోర్ట్ గా నిలిచారు. ఇక దిల్ రాజు దగ్గరున్న థియేటర్లు శర్వానంద్ నటించిన శతమానం భవతికి దక్కుతాయని భావించారు. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్.. థియేటర్ల సంఖ్య ఆధారంగా స్క్రీన్స్ కేటాయించేలా ఏర్పాట్లు చేసుకున్నారట. అంతేకాదు.. మౌత్ టాక్ ఆధారంగా.. ఆ తర్వాత థియేటర్ల కౌంట్ లో మార్పులు చేయాలని భావిస్తున్నారట.
ఏ సినిమాకి నష్టం జరగకుండా.. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఓ నిర్ణయానికి రావడం మంచి పరిణామం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా ధియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది. ముఖ్యంగా మెగా పట్టుగట్టిగా ఉన్న నైజాంలో చిరంజీవి అభిమానులు రచ్చ చేస్తుంటే.. రాయలసీమ రీజియన్లో బాలయ్య ఫ్యాన్స్ సత్తా చాటుతున్నారు. ఇక వీరి సినిమాల ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/