ఆ లొకేషన్లు బాలయ్యవి కాదు సామీ

Update: 2016-05-18 04:24 GMT
నందమూరి నటసింహం ఇప్పుడు తన 100వ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన మొరోకో దేశంలో షూటింగ్‌ చేస్తున్నాడు అనగానే ఇప్పుడు అక్కడి నుండి రోజుకో స్టిల్‌ లీకయ్యి ఇక్కడకు వస్తోంది. వీటిని చూసి అభిమానులు ఎవరికి తోచింది వారు చెప్పేసుకుంటున్నారు. ఈ డిస్కషన్లలో ఇప్పుడు కొత్తగా మరో రెండు ఫోటోలు కూడా తిరుగుతున్నాయి. వాటి కథేంటో చూద్దాం పదండి.

సదరు ఫోటోల్లో.. ఎడారి మధ్యలో ఉన్న ఒక గ్రీకు కాలం నాటి గుడి ఒకటి కనిపిస్తోంది. అక్కడ లైటింగులతో చాలా అందంగా తీర్చిదిద్దారు. అక్కడ బాలయ్య షూటింగ్‌ చేస్తున్నాడని.. గౌతమీపుత్రి శాతకర్ణి షూటింగ్‌ స్పాట్‌ ఇదేనంటూ అందరూ రచ్చ చేసేస్తున్నారు. కాని నిజానికి ఆ ఫోటోల్లో ఉంది జోర్డాన్‌ దేశంలోని పెట్రా అనే పా్రంతం. క్రీస్తు పూర్వం 312లో కట్టిన ఒక అరబిక్‌ నగరం ఈ పెట్రా. ఆ తరువాత దానిని 100 ఎడి లో రోమన్లు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు. కాని ఆ ప్రాంతంలోని ఏ ఒక్క కట్టడం కూడా గౌతమీపుత్రి శాతకర్ణి సినిమాకు కావల్సిన లొకేషన్లు కాదు. ఇక అక్కడ షూటింగ్‌ కూడా చేయట్లేదని సినిమా వర్గాలు కూడా తుపాకి.కామ్ తో వెల్లడించాయి.

అయితే ఈ పెట్రా ఎడారుల్లోమనోళ్లు రెగ్యులర్‌ గా పాటలను తీస్తుంటారు. నాగార్జున 'రగడ' సినిమాలో ఒక్కడంటే ఒక్కడే సాంగ్‌.. అలాగే రామ్‌ చరణ్‌ 'గోవిందుడు అందరివాడేలే'లో రారా కుమారా సాంగ్‌.. అక్కడే తీశారు. అది సంగతి.
Tags:    

Similar News