గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న సినిమాలకు కలెక్షన్లుండవు. కలెక్షన్లున్న సినిమాకు గొప్ప సినిమాగా పేరు రాదు. ఈ రెండు క్వాలిటీస్ ఉన్న సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని చెప్పుకోవాలి. అంచనాలకు తగ్గట్లే ఈ సినిమాను విమర్శకులు ఆకాశానికెత్తేశారు. గొప్ప సినిమాగా కీర్తించేశారు. ఐతే సినిమా గురించి ఎవరెంత పొగిడినా.. ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో.. అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఇది నచ్చుతుందో లేదో అన్న సందేహాలు కలిగాయి. కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నాలుగు రోజుల ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల వరకే రూ.25.5 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. బాలయ్య కెరీర్లో ఇది రికార్డు.
ఫస్ట్ వీకెండ్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నైజాం ఏరియాలో రూ.6.6 కోట్ల షేర్ రాబడితే.. బాలయ్యకు కంచు కోట అనదగ్గ సీడెడ్లో ఏకంగా రూ.5.4 కోట్లు కొల్లగొట్టింది. నెల్లూరులో రూ.1.24 కోట్లు.. గుంటూరులో రూ.3.07 కోట్లు.. కృష్ణాలో రూ.2.02 కోట్లు.. పశ్చిమగోదావరిలో రూ.2.43 కోట్లు.. తూర్పు గోదావరిలో రూ.2.08 కోట్లు.. ఉత్తరాంధ్రలో రూ.2.66 కోట్ల షేర్ వసూలైంది. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య గత రికార్డులు బద్దలయ్యాయి. అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. కర్ణాటకలోనూ మంచి వసూళ్లే వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ వసూళ్లు రూ.50 కోట్ల దాకా ఉన్నాయి. సెకండ్ వీకెండ్లోనూ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ భారీగానే వసూళ్లు రాబట్టే అవకాశముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/