తెలుగు జాతి ప్రతిష్టను వేనోళ్ల కీర్తించే చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి పేరు తెచ్చుకుంది. అన్ని ఏరియాల నుంచి సక్సెస్ ఫుల్ టాక్ తో పాటు.. బాలయ్య కెరీర్ బెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుండడంపై నిర్మాతలు రాజీవ్ రెడ్డి.. బిబో శ్రీనివాస్ లు స్పందించారు.
'ఇంత తక్కువ సమయంలో తెరకెక్కించిన క్రెడిట్ అంతా దర్శకుడు క్రిష్ దే. రాత్రి పగలు అనే తేడా లేకుండా షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి చేయగలిగాడు. షూటింగ్ టైంలో కొన్ని సమస్యలు వచ్చినా.. వాటన్నిటినీ అధిగమించాం. ఈ సినిమాను మొత్తం 55 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేయగలిగాం. ఇందులో బాలయ్యగారి సపోర్ట్ మరిచిపోలేనిది. తనకు నార్మల్ రూమ్ చాలని.. అందరితో పాటు ఎకానమీ క్లాస్ నే బుక్ చేయమని చెప్పడం మాకు ఆశ్చర్యం కలిగించింది. అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉండడం ఆయనకు మాత్రమే సాధ్యం. టాలీవుడ్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పారు శాతకర్ణి నిర్మాతలు.
'కలెక్షన్స్ విషయంలో మాకు కరెక్ట్ ఫిగర్స్ అందాక వెల్లడిస్తాం. ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ కి మంచి స్పందన వస్తోంది. క్రిష్-సాయి మాధవ్ లు ఎంతో శ్రమించారు. సీతారామశాస్త్రి గారు రాసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది'అంటూ సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రశంసించారు రాజీవ్ రెడ్డి.. బిబో శ్రీనివాస్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/