డిసెంబర్ 16.. ఐదింటికి.. గెట్ రెడీ

Update: 2016-12-12 14:04 GMT
ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి 150వ చిత్రం ఒకటి 100వ చిత్రం అనేకంటే కూడా.. ఒకటి ఎన్నాళ్లుగానో టాలీవుడ్ మిస్సవుతున్న మాస్ సినిమా.. ఇంకొకటి మనం మర్చిపోతున్న హిస్టారికల్ జానర్ లో వస్తున్న లెజండరీ చక్రవర్తి శాతకర్ణి సినిమా. అందుకే వీటిపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒకెత్తున్న ఉన్నాయి.

ఎప్పటినుండో అందరూ బాలయ్య హీరోగా రూపొందుతున్న ఆయన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొన్న 9నే విడుదలవ్వాల్సిన ఈ ట్రైలర్ ను అనవసర క్లాషెస్ ఎందుకుని బాలయ్య పోస్టుపోన్ చేశారు. అయితే డిసెంబర్ 16న సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ లో బాలయ్య ఈ ఎపిక్ హిస్టారికల్ మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ రోజు ఉదయం నుండి దగ్గర్లోని కోటిలింగాల పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిపి.. సాయంత్రం ట్రైలర్ లాంచ్ లో పాల్గొంటారు.

ఇక సాయంత్రం 5 గంటలకు.. బాలయ్య 100వ సినిమాను తెలుగు రాష్ట్రంలలో 100 ధియేటర్లలో లైవ్ లో స్ర్కీనింగ్ చేస్తున్నారు కూడా. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అత్యధిక శాతం విజువల్ ఎఫెక్ట్స్ మాయ ఉండబోతోంది. అవన్నీ అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది.
Tags:    

Similar News