ప‌ప్పులో కాలేసిన యూట్యూబ‌ర్.. గౌత‌మ్ మీన‌న్ స్మార్ట్ రిప్లై!

Update: 2022-09-21 06:54 GMT
త‌మిళ హీరో శింబు హీరోగా న‌టించిన త‌మిళ మూవీ 'వెందు త‌నిధాతు కాడు'. ల‌వ్ స్టోరీస్ స్పెష‌లిస్ట్ గా పేరున్న గౌత‌మ్ మీన‌న్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. పార్ట్ 1గా రూపొందిన ఈ మూవీని తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో స్ర‌వంతి మూవీస్ రిలీజ్ చేశారు.

సెప్టెంబ‌ర్ 15న త‌మిళంలో విడుద‌ల కాగా , తెలుగులో రెండు రోజులు ఆల‌స్యంగా సెప్టెంబ‌ర్ 17న ఈ మూవీని రిలీజ్ చేశారు. చాలా రోజుల త‌రువాత గైత‌మ్ మీన‌న్ నుంచి వ‌చ్చిన సినిమా కావ‌డం, శింబు చేసిన రియ‌లిస్టిక్ మూవీ కావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

దీంతో తెలుగులో భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించారు. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్‌, హీరోయిన్ సిద్ధి ఇద్నాని పాల్గొన్నారు. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ప‌లు మీడియాల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. త‌మిళంలో సెప్టెంబ‌ర్ 15నే రిలీజ్ కావ‌డంతో తెలుగులో మంచి టాక్ మొద‌లైంది. దీంతో గౌత‌మ్ మీన‌న్ ప‌లు యూట్యూబ్ ఛాన‌ల్స్ కి కూడా ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో గౌత‌మ్ మీన‌న్ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ని ఎదుర్కొని షాకయ్యారు.

త‌ను చేయ‌ని సినిమా గురించి యూట్యూబ‌ర్ క్వ‌శ్చ‌న్ చేయ‌డంతో గౌత‌మ్ మీన‌న్ చాలా స్మార్ట్ గా వ్య‌వ‌హ‌రించి స‌ద‌రు యూట్యూబ‌ర్ కి షాకిచ్చాడు. మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామా 'చెక్క‌చివంత వానం'. ఇదే మూవీని తెలుగులో 'న‌వాబ్' పేరుతో రిలీజ్ చేశారు.

విజ‌య్ సేతుప‌తి, అర‌వింద్ స్వామి, శింబు, జ్యోతికి, అదితీరావు హైద‌రీ, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అయితే ఈ విష‌యం తెలియ‌ని యూట్యూబ‌ర్ ఈ మూవీని గౌతమ్ మీన‌న్ డైరెక్ట్ చేశాడ‌ని అపోహ‌ప‌డి ఇలాంటి న‌టుల‌ని ఒకే సినిమాలో సెట్ చేయ‌డం కష్టంగా అనిపించ‌లేదా? అని ప్రశ్నించాడ‌ట‌.

విష‌యం అర్థం కావ‌డంతో 'త‌ను మ‌ణిర‌త్నం.. గౌత‌మ్ మీన‌న్ కాదు. త‌న సినిమా అంటే ఆర్టిస్ట్ లు టైమ్ కు వ‌స్తారు దాని వ‌ల్ల క‌ష్టం కాదు' అని గౌత‌మ్ మీన‌న్ చాలా స్మార్ట్ గా స‌మాధానం చెప్పి స‌ద‌రు యూట్యూబ‌ర్ కి షాకివ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో జ‌రిగిన త‌ప్పు తెలుసుకున్న స‌దరు యూట్యూబ‌ర్ నాలుక క‌రుచుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News