రామాయణంపై గీతా ఆర్ట్స్ అడుగేసింది

Update: 2017-06-08 04:36 GMT
బాహుబలి2 గ్రాండ్ సక్సెస్ తర్వాత భారీ చిత్రాల నిర్మాణం చేస్తామంటూ చాలామందే ముందుకొస్తున్నారు. కంటెంట్ ఉంటే ఎంతటి బడ్జెట్ ను అయినా తిరిగి రాబట్టుకోవడం సాధ్యమే అనే సంగతి నిరూపితం కావడంతో.. పలుభాషల్లో ఇలాంటి ప్రాజెక్టులపై ప్రకటనలు వచ్చాయి.

మలయాళంలో మోహన్ లాల్ తో మహా భారత్.. తెలుగులో అల్లు అరవింద్ తీస్తానన్న రామాయణం.. తమిళంలో సంఘమిత్ర.. ఇలాంటి బాపతే. అయితే.. మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి  రామాయణం తీస్తానని అల్లు అరవింద్ చెప్పారు కానీ.. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. 'సంపూర్ణ రామాయణం' అనే టైటిల్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిజిస్ట్ చేయించేశారు. అంటే.. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందన్న మాట. అయితే.. ఇంతకీ రాముడుగా ఎవరు నటిస్తారనే విషయంపై నిర్మాతల నుంచి క్లారిటీ లేదు కానీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం మా రామ్ చరణే శ్రీరాముడు అంటూ తెగ హంగామా చేసేస్తున్నారు.

మరికొన్ని ఆసక్తికరమైన టైటిల్స్ కూడా ఫిలిం ఛాంబర్ దగ్గర రిజిస్టర్ అయ్యాయి. సితార ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై 'సీతారామ కళ్యాణం'.. వారాహి చలనచిత్రం బ్యానర్ పై 'సహోదర'.. 'తమ్మడు'.. లను రిజిస్టర్ చేశారు. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ అయిన 'గరుడ'.. 'కన్నప్ప కథ' లను తిరిగి పునరుద్ధరించడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News