వీకెండ్ అయ్యాక కూడా ‘గీత గోవిందం’ జోరేమీ తగ్గలేదు. విడుదలై ఐదు రోజులు దాటినా.. సోమ, మంగళవారాల్లో సైతం ఈ చిత్రం అదరగొట్టింది. వీక్ డేస్‌లో ఈ చిత్రం రెండు రోజులకు ఆరు కోట్ల షేర్ రాబట్టడం విశేషం. పెద్ద పెద్ద సినిమాలకే సాధ్యం అయ్యే ఘనత ఇది. ఐదు రోజుల తొలి వారాంతంలో ‘గీత గోవిందం’ రూ.31.65 కోట్ల షేర్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజుల్లో దాదాపు రూ.6 కోట్లకు పైగా షేర్ రావడంతో ఈ చిత్ర మొత్తం వసూళ్లు రూ.37.7 కోట్లకు చేరుకున్నాయి. నైజాంలో ప్రభంజనాన్ని కొనసాగించిన ‘గీత గోవిందం’ రూ.10 కోట్ల షేర్ మార్కును దాటడం విశేషం. ఇక్కడ మొత్తం షేర్ రూ.10.7 కోట్లకు చేరుకుంది. మిగతా ఏరియాల్లోనూ ఈ చిత్రం జోరు కొనసాగిస్తోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.50 కోట్ల షేర్ మార్కును అందుకుని సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏరియాల వారీగా తొలి వారాంతంలో ‘గీత గోవిందం’ వరల్డ్ వైడ్ షేర్ల వివరాలు..
నైజాం- రూ.10.7 కోట్లు
సీడెడ్- రూ.3.9 కోట్లు
వైజాగ్- రూ.2.77 కోట్లు
తూర్పు గోదావరి- రూ.2.1 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.1.75 కోట్లు
కృష్ణా- రూ.2.1 కోట్లు
గుంటూరు- రూ.2.06 కోట్లు
నెల్లూరు- రూ.82 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.26.2 కోట్లు
కర్ణాటక- రూ. 2.48 కోట్లు
తమిళనాడు- రూ.86 లక్షలు
యుఎస్- రూ.6.66 కోట్లు
మిగతా ఏరియాల్లో- రూ.1.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.37.7 కోట్లు
ఏరియాల వారీగా తొలి వారాంతంలో ‘గీత గోవిందం’ వరల్డ్ వైడ్ షేర్ల వివరాలు..
నైజాం- రూ.10.7 కోట్లు
సీడెడ్- రూ.3.9 కోట్లు
వైజాగ్- రూ.2.77 కోట్లు
తూర్పు గోదావరి- రూ.2.1 కోట్లు
పశ్చిమ గోదావరి- రూ.1.75 కోట్లు
కృష్ణా- రూ.2.1 కోట్లు
గుంటూరు- రూ.2.06 కోట్లు
నెల్లూరు- రూ.82 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.26.2 కోట్లు
కర్ణాటక- రూ. 2.48 కోట్లు
తమిళనాడు- రూ.86 లక్షలు
యుఎస్- రూ.6.66 కోట్లు
మిగతా ఏరియాల్లో- రూ.1.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.37.7 కోట్లు