ఇక 50 కోట్లపై కన్నేసిన గోవిందం!

Update: 2018-08-23 08:12 GMT
విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' బాక్స్ ఆఫీస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు.  ఎనిమిది రోజులకుగానూ ప్రపంచవ్యాప్తంగా 42. 60 కోట్ల రూపాయల షేర్ సాధించి దుమ్ము దులుపుతోంది.  విజయ్ కు ఇది 40 కోట్ల షేర్ కలెక్షన్స్ క్లబ్ లో మొదటి సినిమా.  ఈ ఊపు చూస్తుంటే 50 కోట్ల క్లబ్  లోకి ఎంట్రీ ఇవ్వడం పెద్ద కష్టమైన టార్గెట్ కాదు.  ఆ ఘనత సాదించిన ఫస్ట్ మీడియం రేంజ్ స్టార్ హీరో విజయ్ అవ్వడం కూడా దాదాపు ఖాయమే.

కానీ అంతకంటే ముందుగా రూ. 48 కోట్ల మార్క్ దాటాలి కదా. మరి ఆ నంబర్ స్పెషల్ ఏంటి? మీడియం రేంజ్ హీరో ల సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ నితిన్ సినిమా 'అ ఆ' సాధించింది.  48 కోట్ల రూపాయల షేర్ తో ఆ సినిమా అగ్ర స్థానం లో ఉంది.  సో.. గోవిందం ఈజీగా ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేలా ఉన్నాడు.  మరో వైపు ఈ సినిమా ఓవర్సీస్ లో 'అర్జున్ రెడ్డి' ఫుల్ రన్ కలెక్షన్స్ ను దాటింది. అర్జున్ రెడ్డి ఓవర్సీస్ కలెక్షన్స్  $1.77 మిలియన్స్  కాగా 'గీత గోవిందం' కలెక్షన్స్ ఇప్పుడు $1.78 మిలియన్స్.  'గీత గోవిందం' ఫుల్ రన్ లో $2 మిలియన్ డాలర్స్ మార్క్ ను దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఈ గోవిందం హంగామా ఇంతటితో ఆగుతుందా?  లేకపోతే ఎంతదూరం వరకూ వెళ్తుందనేది ట్రేడ్ వర్గాలకు కూడా అంతుచిక్కడం లేదు. పోటీ పెద్దగా లేకపోవడం.. ఈ వారం.. పైవారం రిలీజ్ కానున్న సినిమాలు పెద్దగా హైప్ ఉన్నవి కాకపోవడంతో అన్నీ 'గీతగోవిందం' సినిమాకు ప్లస్ గా మారనున్నాయి.
Tags:    

Similar News