విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా పరుశురామ్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ‘గీతగోవిందం’ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా యూత్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో పాటు - వరుసగా సెలవలు రావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. మొదటి అయిదు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం ట్రేడ్ విశ్లేషకులను సైతం విష్మయపర్చుతూ ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పటి వరకు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం అయిన 50 కోట్ల షేర్ ను విజయ్ దేవరకొండ దక్కించుకోవడంతో ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ గా అంతా ఒప్పుకున్నారు.
‘గీత గోవిందం’ చిత్రం శనివారంకు 25 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలైన - చిన్న హీరోల సినిమాలైనా కూడా రెండు లేదా మూడు వారాలు మాత్రమే థియేటర్లలో ఉంటున్నాయి. చాలా అరుదుగా, కొన్ని ఏరియాల్లో మాత్రమే స్టార్ హీరోల సినిమాలు నాలుగు వారాలు కనిపిస్తున్నాయి. కాని ‘గీత గోవిందం’ చిత్రం మాత్రం ఏకంగా 402 థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే కలెక్షన్స్ పరంగా స్టన్నింగ్ రికార్డులను సొంతం చేసుకున్న గీత గోవిందం ఇలా థియేటర్ల సంఖ్య పరంగా కూడా స్టార్ హీరోల సినిమాలను పక్కకు నెట్టేసింది.
చిత్రంకు సంబంధించిన అధికారిక పీఆర్ టీం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 402 థియేటర్లలో ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకోబోతుండగా * తెలుగు రాష్ట్రాల్లో 304 థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకోబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏకంగా 100 థియేటర్లలో ఈ చిత్రం 25 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఏ హీరోకు కూడా ఇంతటి ఘనత దక్కలేదంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రం 62 కోట్లకు పైగా షేర్ ను దక్కించుకుంది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ స్థాయి ఏ రేంజ్ లో పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.