గీత గోవిందం ఫుల్ రన్ కలెక్షన్స్

Update: 2018-10-24 13:15 GMT
గీత గోవిందం ఫుల్ రన్ కలెక్షన్స్
  • whatsapp icon
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  నిర్మాతలైన జీఎ2 పిక్చర్స్ వారికే కాకుండా పంపిణీ చేసిన వారికి కూడా లాభాల పంట పండించింది.  'అర్జున్ రెడ్డి' తో వచ్చిన విజయ్ దేవరకొండ క్రేజ్ కు తోడుగా గీతా ఆర్ట్స్ వారి ప్లానింగ్.. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ కావడం లాంటి అంశాలు సినిమా భారీ విజయం సాధించడానికి తోడ్పడ్డాయి.

ఇక విజయ్ దేవరకొండ కు మొదటి సారి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్ లో..  రూ. 70 కోట్ల షేర్ క్లబ్ లో చేర్చింది ఈ సినిమా.  ఈ సినిమా నిన్న మొన్నటివరకూ ఎక్కడో ఒక థియేటర్లో ఉండేది కాని ఇప్పుడు ఫుల్ రన్ పూర్తయింది.  నైజాం ఏరియాలో 20 కోట్ల షేర్ సాధించిన అతి కొద్దిమంది హీరోల లిస్టు లో విజయ్ దేవరకొండ చేరడం ఒక విశేషం. ఇక ఏపీ తెలంగాణాలలో కలిపి రూ. 50 కోట్ల షేర్ సాధించింది.  ఇక ప్రపంచవ్యాప్తంగా రూ 70 కోట్ల కు పైగా షేర్ సాధించింది.   
'గీత గోవిందం' ఎస్టిమేటేడ్  థియేట్రికల్ రైట్స్ విలువ రూ. 15 కోట్లు మాత్రమే. ఈ లెక్కన ఎంత లాభం తెచ్చిందో మీరే లెక్కేసుకోండి.  'గీత గోవిందం' క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలివే.  

నైజాం - 20.50  cr

సీడెడ్ - 7.04 cr

ఉత్తరాంధ్ర - 6.03 cr

ఈస్ట్  - 4.02  cr

వెస్ట్ - 3.16  cr

కృష్ణ - 3.79  cr

గుంటూరు - 3.73  cr

నెల్లూరు - 1.77  cr

టోటల్ - రూ.  50.04 (ఏపీ + తెలంగాణాషేర్)

కర్ణాటక - 6.10 cr

తమిళనాడు - 2.12 cr

ఓవర్సీస్ - 9.81 cr

మిగతా ఏరియాలు - 2.50 cr  

వరల్డ్ వైడ్ టోటల్ - రూ. 70.57 cr
Tags:    

Similar News