అనారోగ్యంతో ఉన్నా పట్టు వదలని విక్రమార్కుడు!
నాలుగేళ్ల క్రితం హీరోగా నటించాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు.;
టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్లు.. ఇండస్ట్రీ హిట్లు తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు దశాబ్ధాలు పైగా అగ్ర దర్శకుడిగా, పంపిణీదారుగా కొనసాగిన అతడు మెగా బ్లాక్ బస్టర్లతో మెగా దర్శకుడిగాను సంచలన చిత్రాల్ని తెరకెక్కించారు. అతడు దర్శకుడిగానే కాదు నటుడిగాను ప్రయత్నించారు. నాలుగేళ్ల క్రితం హీరోగా నటించాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు. ఇటీవల హిందీలో తన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీమేక్ చేసాడు. కానీ అది ఊహించని విధంగా ఫ్లాపైంది.
అయినా ఇప్పటికీ అతడు అవకాశాల కోసం ప్రయత్నం ఆపలేదు. పారితోషికం విషయంలోను ఎక్కడా తగ్గడం లేదు. అయితే జీవితం ఎప్పుడూ ఒకే విధంగా సాగదు. అతడు గత రెండు సంవత్సరాలుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత సంవత్సరం ఆయనకు కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. దీని నుంచి బాగా కోలుకున్నారు. గత కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు అతడిని సందర్శించేందుకు వచ్చిన ప్రముఖుల మాట ప్రకారం.. మళ్లీ అనారోగ్యం ఇబ్బందిపెడుతోంది.
ఇండస్ట్రీలో గొప్ప సత్సంబంధాలు ఉన్న దర్శకుడు అనారోగ్యంతో ఉండటంతో అతడిని తన నిర్మాతలు, హీరోలు కలిసి పలకరిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కొందరు హీరోలు, సహ దర్శకులు, నిర్మాతలు ఫోన్ లలో కూడా పరామర్శిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి ఆరోగ్యంపైనే ఆ దర్శకుడు దృష్టి సారించారు. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుని, అటుపై తిరిగి పనిలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆరోగ్యంపైనే దృష్టి సారించనున్నారని తెలిసింది.