'స్పిరిట్' తో సందీప్ రెడ్డి టార్గెట్ 2000 కోట్లా?
ఎందుకంటే తదుపరి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' చేస్తున్నాడు కాబట్టి ఈ రకమైన గెస్సింగ్స్ తెరపైకి రావడం సహజమే.;
తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 50 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. అటుపై అదే చిత్రాన్ని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసి 300 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాడు. 'కబీర్ సింగ్' లాంగ్ రన్ లో 380 కోట్ల వసూళ్లను సాధించింది. అటుపై 'యానిమల్' తో ఏకంగా 900 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. 1000 కోట్లకు కేవలం 100 కోట్ల దూరంలోనే ఆగిపోయాడు. ఇలా మూడు సంచలన విజయాలు అందుకున్న సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ టార్గెట్ 2000 కోట్లు అయి ఉండొచ్చు? ఎందుకంటే తదుపరి చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'స్పిరిట్' చేస్తున్నాడు కాబట్టి ఈ రకమైన గెస్సింగ్స్ తెరపైకి రావడం సహజమే.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఉత్పన్నమైంది. 'స్పిరిట్' ద్వారా సందీప్ రెడ్డి వంగా రూ. 2000 కోట్ల చిత్రాన్ని అందిస్తారా? అని ఫిల్మ్ జర్నలిస్ట్ అడిగాడు. దానికి సందీప్ ఇలా బధులిచ్చాడు. 2000 కోట్లు అన్నది అతి పెద్ద సవాల్. చెప్పినంత ఈజీ కాదు.' బాహుబలి 2' ఆ మార్క్ కి దగ్గరగా వెళ్లింది. అది ప్రేక్షకుల్ని ఎంతో గొప్పగా ఆకట్టుకున్నచిత్రం. ఎంతో ఆసక్తిని కలిగించే చిత్రమిది.
మరి 'స్పిరిట్' తో అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాలి. 'బాహుబలి 2' రికార్డులను కొట్టాలని నాకైతే లేదు. ఆ విషయంలో ఎలాంటి ఒత్తిడి కూడా తీసుకోను అని అన్నారు. అయితే సందీప్ బాక్సాఫీస్ వసూళ్ల కోసం సినిమాలు చేసే డైరెక్టర్ కాదు. తాను కేవలం సినిమాల మీద ఫ్యాషన్ తో సక్సెస్అయిన దర్శకుడు. తొలి సినిమా 'అర్జున్ రెడ్డి'కి తానే సొంత డబ్బు తెచ్చిపెట్టాడు. ఆ సినిమా పోతే గనుక మళ్లీ సినిమాల వైపు చూసే వాడిని కాదని...ప్రత్యామ్నాయంగా ప్రశాంతమైన జీవితాన్ని ముందుగానే డిజైన్ చేసి పెట్టుకున్నట్లు తెలిపాడు.
అలాగే తాను కథలు రాసే టప్పుడు హీరోలు మైండ్లో ఉండరు. కేవలం కొన్ని కేసెస్ లో మాత్రమే హీరోల ఇమేజ్ ని పరిగణలోకి తీసుకుంటాడు. కథ పూర్తయిన తర్వాత ఆ పాత్రలో ఎవరైతే బాగుంటుందని తర్వాత ఆలోచన చేస్తాడు. తన సినిమాలో హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ అవసరం లేదని..స్టార్లు కావాల్సిన పనిలేదని... చిన్న హీరోయిన్ అయినా తాను రాసుకున్న పాత్రకు సెట్ అవుతుందంటే తెచ్చి పెట్టేసే రకం. కేవలం పాత్రలు మాత్రమే నటీనటుల్ని డిసైడ్ చేస్తాయని.... పాత్రలను నటీనటులు డిసైడ్ చేయరని నమ్మే డైరెక్టర్ సందీప్.