పైరసీ భూతాన్ని అరికట్టడానికి పరిశ్రమ తరఫున ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు సరికదా ఇప్పుడు ఇది కొత్త రూపం తీసుకుని ఏకంగా విడుదలకు ముందే సీన్లు బయటికి వచ్చే దాకా తెచ్చేసింది. ఇది గీత గోవిందం విషయంలోనే జరిగింది కాదు. గతంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు చేదు జ్ఞాపకంగా మిగిలిన అత్తారింటికి దారేది పైరసీ సినిమా విడుదల తేదీ ప్రకటించకముందే ఆన్ లైన్ లో రచ్చ చేసి యూనిట్ ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేసింది. కానీ ప్రేక్షకులు అదేమీ పట్టించుకోకుండా కంటెంట్ ఉన్న మూవీ కావడంతో బ్రహ్మరధం పట్టేసి ఇండస్ట్రీ రికార్డులు కూడా కట్టబెట్టారు. ఇది గత చరిత్ర. ఇప్పుడు గీత గోవిందం వరస చూస్తుంటే అది దారిలో ఉన్నట్టు కనిపిస్తోంది. మొదటిరోజే 9 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ ని సైతం నివ్వరపోయేలా చేసిన ఈ మూవీ రేంజ్ ని ఊహించడం కూడా కష్టంగానే ఉంది. అంత పెద్ద సక్సెస్ అనేది ఇండస్ట్రీ మాట.
ఇదిలా ఉంచితే అత్తారింటికి దారేది తరహాలోనే బాధించబడిన గీత గోవిందం ఆ సినిమా రీతిలోనే బ్రహ్మాండమైన సక్సెస్ సాధించడం ఇదేదో సెంటిమెంట్ లా ఉందే అని కొందరు ఫాన్స్ విశ్లేషిస్తున్నారు. అది పక్కన పెడితే అప్పుడు అత్త తరహాలో ఇప్పుడు గీత పైరసీని ఎదురుకుని విన్నర్ గా నిలవడమే విశేషం. ఈ సెంటిమెంట్ సంగతి ఏమో కానీ ఇకనైనా పైరసీ రక్కసిని సమూలంగా అంతమొందించే చర్యల దిశగా ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎంత కట్టుదిట్టంగా నిర్మాతలు తమవంతుగా పైరసీ జాడలు పసిగట్టి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నా ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉంటుంది. గీత గోవిందం లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు అంతగా ఇబ్బంది ఉండదు కానీ యావరేజ్ టాక్ వచ్చిన వాటి విషయంలో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఏళ్ళ తరబడి పరిశ్రమ పెద్దలు ఘోషిస్తూనే ఉన్నా పరిష్కారం మాత్రం దొరకడం లేదు.