2 మిలియన్ క్లబ్ లో చోటు.. నానికంటే గ్రేటు!

Update: 2018-08-26 09:39 GMT
ఆగష్టు 15 నుండి అంతా 'గీత గోవిందం' హంగామానే.  మొదటి రోజునుండి పాజిటివ్ మౌత్ టాక్ - రివ్యూస్ తో మొదలైన సినిమా బాక్స్ ఆఫీసుకు పండగ తీసుకొచ్చింది.  అమెరికా విషయమే తీసుకుంటే తాజా అప్డేట్ ప్రకారం $2 మిలియన్ మార్క్ ను దాటింది. 

ఈ సంవత్సరం టాప్ టెన్ కలెక్షన్స్ లిస్టు లో 5 వ స్థానం లో నిలిచింది.

1. రంగస్థలం - $3,513,450.00
2. భరత్ అనే నేను -  $3,416,451.00
3. మహానటి - $2,543,515.00
4. అజ్ఞాతవాసి - $2,065,527.00
5. గీత గోవిందం - $2,005,097.00
6. భాగమతి - $1,108,116.00
7. తొలిప్రేమ - $1,091,802.00
8. అ! - $849,928.00
9. నా పేరు సూర్య - $766,295.00
10. గూఢచారి - $756,757.00

ఇక 2 మిలియన్ డాలర్ క్లబ్ గురించి మాట్లాడుకుంటే విజయ్ కి ఈ క్లబ్ లో మొదటి సినిమా 'గీత గోవిందం'. ఇక ఈ లిస్టు లోఉన్న ఇతర హీరోలు ఎన్ని సినిమాలు 2 మిలియన్ డాలర్స్ సాధించాయో చూద్దాం.

ప్రభాస్ - 2 (బాహుబలి 1 & 2)
మహేష్ బాబు - 2 (శ్రీమంతుడు, భరత్ అనే నేను)
ఎన్టీఆర్ - 1 (నాన్నకు ప్రేమతో)
చిరంజీవి - 1(ఖైది నెంబర్ 150)
పవన్ కళ్యాణ్ - 1 (అజ్ఞాతవాసి)
నితిన్ - 1 (అ ఆ)
వరుణ్ తేజ్ - 1 (ఫిదా)
రామ్ చరణ్ - 1 (రంగస్థలం)
విజయ్ దేవరకొండ - (గీత గోవిందం)

ఇక ఈ ఘనత సాధించడం ద్వారా మిడ్ రేంజ్ స్టార్ హీరోల్లో ఓవర్సీస్ లో స్ట్రాంగ్ అయిన నాని కంటే విజయ్ దేవరకొండ గ్రేట్ అనిపించుకున్నాడు.  ఎందుకంటే నాని కి 1 మిలియన్ డాలర్ క్లబ్ లో  చాలా సినిమాలు ఉన్నాయి గానీ 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ఇంతవరకూ స్థానం దొరకలేదు. నాని సినిమాల్లో ఓవర్సీస్ లో బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్ ($1.4 మిలియన్స్).  అంతే కాదండోయ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఇంతవరకూ 2 మిలియన్ డాలర్ క్లబ్ లో ప్లేస్ దొరకలేదు. ఈలెక్కన గోవిందం హంగామా మామూలుగా లేదు.
   

Tags:    

Similar News