ఈ సీజన్ బంపర్ హిట్ ఏది? అంటే `గీత గోవిందం` అన్న మాట వినిపిస్తోంది. ద్వితీయార్థంలో సెన్సేషనల్ హిట్ చిత్రమిది. జీఏ2 కంపెనీకి 50 కోట్ల షేర్ అందించి ఖుషీ చేసిన మేటి చిత్రరాజమిది. విజయ్ దేవరకొండ నటించిన నాలుగు సినిమాలకే సూపర్ స్టార్ గా అవతరించడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఏ నలుగురు గుమిగూడినా గీతగోవిందం విజయం గురించి, దేవరకొండ, కన్నడ బ్యూటీ రశ్మిక మందన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నైజాం హీరోకి అదృష్టం శని పట్టినట్టే పట్టిందని ఒకటే ముచ్చట సాగుతోంది.
అయితే ఈ సినిమా రశ్మిక స్వస్థలం కేరళలోనూ రిలీజైంది. సబ్ టైటిల్స్ తో షోలు వేస్తున్నారక్కడ. ఓవైపు కేరళను వరదలు ముంచెత్తినా `గీత గోవిందం` వసూళ్ల వరద పారించడం వాడి వేడిగా చర్చకొచ్చింది. అన్నట్టు .. ఈ సినిమా కేరళలో ఎంత వసూలు చేసినా - ఆ మొత్తాన్ని జీఏ2 సంస్థ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చేస్తామని ప్రకటించింది. అంటే బెంగళూరు - మంగుళూరు వంటి టాప్ సిటీలు సహా కేరళ వ్యాప్త వసూళ్లను లెక్కగట్టి సీఎం నిధికి జమ చేస్తారన్నమాట.
కేరళలో రెండో వారం ఆడుతున్న ఏకైక తెలుగు సినిమాగానూ మరో అరుదైన రికార్డుని గీత గోవిందం అందుకుంది. ఈ సినిమాతో కేరళలో మల్లూ దేవరకొండగా పాపులరవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మలయాళంలోనూ అతడి మార్కెట్ పెరిగినట్టే ఇక. అల్లు అర్జున్ - రామ్ చరణ్ తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండకే ఆ ఛాన్సుంటుందని తాజా సీన్ చెబుతోంది. ఒకే ఒక్క సినిమా దేవరకొండ లైఫ్ ని ఆ ఎత్తుకి తీసుకెళ్లిపోయిందన్నది నిజం. ఇక దీనిని నిలబెట్టుకుని ఇంకా పెద్ద ఎత్తుకి ఎదగడమే బ్యాలెన్స్.