ఇప్పుడు సినిమాను అమ్ముకోవడం అంటే కేవలం థియేట్రికల్ రైట్స్ వరకే పరిమితం కాదు. నిర్మాతలకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లాంటి యాప్స్ పుణ్యమా అని డిజిటల్ హక్కుల రూపంలో ఊహించని మొత్తాన్ని అందుకుంటున్నారు ప్రొడ్యూసర్లు. కాకపోతే చాలా మటుకు సేఫ్ కావడానికి విడుదలకు ముందే అమ్ముకోవడం అధికశాతం పాటిస్తున్న సూత్రం. ఒకవేళ సినిమా మీద చాలా నమ్మకం ఉండి భారీ ధర వస్తుంది అనుకుని ఆగిపోయే వాళ్ళు లేకపోలేదు. మహానటి అలా వేచి చూడడం చాలా పెద్ద ప్లస్ అయ్యింది. కానీ గీత గోవిందం సక్సెస్ ని ఈ రేంజ్ లో ఊహించని గీత ఆర్ట్స్ 2 సంస్థ దాన్ని శాటిలైట్ హక్కుల రూపంలో కేవలం కోటిన్నరకే అమ్మేసిందట. జీ ఛానల్ ఈ బంపర్ ఆఫర్ కొట్టేసిందని టాక్. నిజానికి ఈ ఛానల్ లో ఇప్పటి దాకా ప్రీ రిలీజ్ లో కొన్న సినిమాలు ప్రతికూల ఫలితాలే ఇచ్చాయి. బ్రహ్మోత్సవం-స్పైడర్-బ్రూస్ లీ లాంటివన్నీ క్రేజ్ ని కాంబోని నమ్ముకుని కోట్లకు పోసి కొని రేటింగ్స్ రాలేక నష్టపోయారు. ఇప్పుడు గీత గోవిందం రూపంలో జాక్ పాట్ తగిలే సరికి సదరు ఛానల్ ఆనందం మాములుగా లేదట.
గీత గోవిందం మీద నమ్మకం ఉన్నా అంత రీజబుల్ గా అల్లు అరవింద్ లాంటి క్యాలికులేటెడ్ నిర్మాత ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందట. దీంతో టాక్సీ వాలాను కూడా కాంబో ఆఫర్ లో ఇచ్చే షరతు మీదే గీత గోవిందం అమ్మారని టాక్. లోగుట్టు పెరుమాళ్ళుకెరుక తరహాలో దానికి కారణం అంత ఈజీగా గెస్ చేయలేము కానీ ఏదో ఎత్తుగడతోనే ఇలా సెట్ చేశారనుకోవచ్చు. ఒకవేళ విడుదల అయ్యాక కనక గీత గోవిందం శాటిలైట్ మార్కెట్ లో పెట్టి ఉంటే మాత్రం కనిష్ట పక్షం 10 కోట్లయినా వచ్చేవి. అంటే ఆరు రెట్లు అధిక లాభమన్న మాట. కొన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఇలాగే ఉంటాయి. రంగస్థలం సైతం ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఊహించని మైత్రి సంస్థ అమెజాన్ డిజిటల్ స్ట్రీమింగ్ తో పాటు శాటిలైట్ చాలా రీజనబుల్ గా అమ్మేసింది. తీరా చూస్తే రికార్డుల ఊచకోత మిగిలింది. అర్జున్ రెడ్డి కూడా ఇదే తరహాలో లాభ పడిన సినిమానే. సక్సెస్ అయినప్పుడు ఇలా అనిపిస్తుంది కానీ అదే ఏదైనా తేడా కొట్టినప్పుడు ముందే అమ్మేసుకుని ఉంటే నష్టం తగ్గేది కదా అంటారు. పరిశ్రమ పోకడే అంత.