112 రోజుల సుదీర్ఘ బిగ్ బాస్ సీజన్ 2 ప్రయాణంలో కౌశల్ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సీజన్ విజేతగా నిలిచిన కౌశల్ కంటే ఎక్కువగా రన్నరప్ గా నిలిచిన గీతా మాధురి బిగ్ బాస్ నిర్వాహకుల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బును దక్కించుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. బిగ్ బాస్ ప్రారంభం సమయంలో రెండవ అత్యధిక మొత్తం పారితోషికంను ఈమె డిమాండ్ చేసింది. ఇంటి సభ్యులందరిలో తేజస్వి అత్యధిక రోజువారి పారితోషికం అందుకోగా - ఆ తర్వాత స్థానంలో గీతామాధురి నిలిచింది.
ఫైనల్ వరకు గీతా మాధురి చేరకోవడంతో పాటు రన్నరప్ గా నిలిచిన కారణంగా పారితోషికం మరియు ప్రైజ్ మనీ భారీ మొత్తంలో గీతా మాధురి దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. కౌశల్ కు పారితోషికం మరియు ప్రైజ్ మరీ ఎంత అయితే వచ్చాయో అంతకు ఎక్కువగానే గీతా మాధురి దక్కించుకున్న మొత్తం ఉన్నట్లుగా మా వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఫైనల్ వరకు నెట్టుకు వచ్చిన గీతా మాధురి కౌశల్ ఆర్మీ దెబ్బకు రన్నరప్ గా నిలిచింది.
కౌశల్ కు వచ్చిన ప్రైజ్ మనీలో కొంత మొత్తంను క్యాన్సర్ పేషెంట్స్‌కు దానం చేసిన విషయం తెల్సిందే. ఇక గీత తన పారితోషికం మరియు ప్రైజ్ మనీ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. రన్నప్ గా నిలిచిన గీతా మాధురికి ఆమె భర్త నందు గ్రాండ్ వెల్ కం చెప్పాడు. ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ఆమెను సన్మానించడంతో పాటు, ఆమెకు భారీగా ఆహ్వానం పలికారు.