వయసు మీద పడ్డాక గ్లామర్ తగ్గడం సహజం. పైగా పెళ్లి చేసుకుని.. పిల్లల్ని కన్నాక కూడా మునుపటిలా ఉండాలంటే కష్టం కదా. ఆటోమేటిగ్గా బాడీలో తేడాలొచ్చేస్తాయి. ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ తర్వాత ఏ అమ్మాయికీ అందం మీద ఫోకస్ ఉండదు. ఆ సమయంలో గ్లామర్ తేడాలో వచ్చేయడం సహజం. ఐతే జెనీలియా మాత్రం అదేదో తనకే కొత్తగా జరిగినట్లు ఫీలైపోతోంది. పెళ్లయ్యాక, పిల్లాణ్ని కన్నాక తన గ్లామర్ బాగా దెబ్బతినేసిందంటూ బాధపడిపోతోంది. తన గ్లామర్ విషయంలో వచ్చిన మార్పుల గురించి బయటికి చెప్పుకుంటూ జనాల్ని ఇబ్బంది పెట్టేస్తోంది.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన బాడీ కలర్ బాగా డార్క్ అయిపోయిందట. ముఖమంతా ప్యాచ్ లు ప్యాచ్ లు మారిపోయిందట. కొన్ని రోజుల పాటు తాను అసలు తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికే ఇష్టపడలేదట. వయసుకు మించినట్లు కనిపించడంతో చాలా బాధేసిందట. దీంతో ఇక లాభం లేదని ఈ మధ్యే ఓ ట్రీట్ మెంట్ మొదులపెట్టినట్లు చెప్పింది జెన్నీ. ఇది చాలా ఖరీదైన - మోడర్న్ ట్రీట్ మెంట్ అని.. ఇది పూర్తయ్యాక తాను ఒకప్పటి జెన్నీలా తయారవుతానని చెబుతోంది. మరీ ఇంత ఖర్చు - కష్టం అవసరమా అంటే.. మళ్లీ సినిమాల్లో చేయాలనుకుంటున్నపుడు అన్నీ అవసరమే కదా అంటోంది. ముందు బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తానని.. సౌత్ లో కూడా అవకాశాలొస్తే నటించడానికి తనకే అభ్యంతరం లేదని జెన్నీ చెబుతోంది.