క్రిస్మ‌స్ ఫైట్: `సింగ‌రాయ్` వ‌ర్సెస్ `గ‌ని`

Update: 2021-11-16 06:23 GMT
క‌రోనా క్రైసిస్ కష్ట‌కాలంలో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీలో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా `వి`..`ట‌క్ జ‌గ‌దీష్` చిత్రాలు ఓటీటీ లో రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూట‌ర్లు..ఎగ్జిబిట‌ర్ల‌కు వ్య‌తిరేకిగా ముద్ర వేసుకున్నారు నాని. నిర్మాత‌కు ద‌న్నుగా నిలిచినా కానీ నాని పేరు హైలైట్ అయ్యింది. ఒకానొక స‌మ‌యంలో నాని వ‌ర్సెస్ డిస్ట్రిబ్యూట‌ర్స్.. మాట‌ల యుద్ధం న‌డిచింది. నాని న‌టించిన‌ సినిమాల్ని సైతం బ్యాన్ చేస్తామ‌ని వార్నింగ్ లు ఇచ్చారంటే స‌న్నివేశం ఎంత వెడెక్కిందో అర్ధం చేసుకోవాలి. అయ‌తే క్ర‌మంగా ఆ త‌ర్వాత అవ‌న్నీ కుదుట‌ప‌డ్డాయి. వేడిమీద చ‌న్నీళ్లు చిల‌క‌రించే ప‌నిలో నాని స‌క్సెస‌య్యాడ‌నే చెప్పాలి.

ఇప్పుడు నేచుర‌ల్ స్టార్ నాని కొత్త సినిమా `శ్యామ్ సింగ‌రాయ్ `ని థియేట‌ర్లో రిలీజ్ చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. డిసెంబ‌ర్ 24న  ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి ప్ర‌మోష‌న్ లో బిజీ అయ్యారు. అప్ప‌టికే పాన్ ఇండియా చిత్రం `పుష్ప -ది రైజ్`  కూడా రిలీజ్ అయిపోతుంది.  పెద్ద సినిమాతో వారం గ్యాప్ ఉంది  కాబ‌ట్టి పోటీ లేకుండా నేచ‌ర‌ల్ స్టార్ త‌న సినిమా రిలీజ్ ని అలా ప్లాన్ చేసుకున్నాడు. కొత్త సినిమాలు కూడా రిలీజ్ లు లేక‌పోవ‌డంతో థియేట‌ర్ల స‌మస్య ఉండ‌ద‌ని భావించారు. స‌రిగ్గా క్రిస్మ‌స్ సెల‌వులు కూడా క‌లిసొస్తాయ‌ని ప్లాన్ చేసుకున్నారు. అయితే అనూహ్యంగా  క్రిస్మ‌స్ బ‌రిలోకి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ దిగాడు.

ఆయన క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `గ‌ని` చిత్రాన్ని కూడా డిసెంబ‌ర్ 24న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎప్ప‌టి నుంచో ఈ సినిమా కూడా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.  ఇక ఆల‌స్యం అమృతం విషం అన్న చందంగా స‌రిగ్గా సింఘ‌రాయ్ కిపోటీగానే `గ‌ని`ని  కూడా దించుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ రెండు సినిమాల మ‌ధ్యా ఫైట్ త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.  ఇద్ద‌రి మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఓటీటీలో  రిలీజ్ అయినా నాని గ‌త చిత్రాలు రెండూ పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. దీంతో థియేట‌ర్ రిలీజ్ పైనే ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక వ‌రుణ్ కూడా `గ‌ని`పై భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న గ‌త‌  చిత్రం `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్` ఆశించినంత పెద్ద విజ‌యం సాధించని సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News