పాడు కరోనా ఎంతోమందిని బలి తీసుకుంది. వరుస విషాదాలతో తల్లడిల్లుతున్న వేళ.. మరో విషాద వార్తను కాలం మోసుకొచ్చింది. మిగిలిన రంగాలకు ఏ మాత్రం తీసిపోనట్లుగా కరోనా కాటుతో చిత్రపరిశ్రమ తల్లడిల్లుతోంది. తాజాగా డబ్బింగ్ విభాగంలో తనదైన ముద్ర వేయటంతోపాటు.. మాట రచయితగా గుర్తింపు పొందిన గాన గంధర్వుడు కుమారుడిగా గుర్తింపు ఉన్న ఘంటసాల రత్నకుమార్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
గడిచిన కొద్దికాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన.. గురువారం ఉదయం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. చాలా రోజులుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. దీంతో ఆయనకు కొన్ని రోజులుగా డయాలసిస్ చేస్తున్నారు. ఇటీవల ఆయనకు కరోనా వచ్చిందన్న సందేహం రావటం.. పరీక్షలు నిర్వహిస్తే కరోనా నెగిటివ్ అని తేలటంతో ఊపిరి పీల్చుకున్నారు.
అంతలోనే ఆయనకు హార్ట్ ఎటాక్ రావటం.. చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. తాజాగా ఆయనీ ఉదయం కన్నుమూశారు. డబ్బింగ్ విభాగంలో తన వాయిస్ తో అభిమానుల్ని సొంతం చేసుకన్న ఆయన.. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్.. షారుఖ్ లాంటి వారికి తన గాత్రాన్ని అందించిన సత్తా ఆయన సొంతం.ఆయన మరణం టాలీవుడ్ కు మాత్రమే కాదు ఇతర చిత్రపరిశ్రమలకు లోటేనని చెప్పక తప్పదు. తాతా విషాద వార్తతో టాలీవుడ్ మరోసారి విషాదంలో మునిగిపోయింది.