సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు.. తమ వారసులను రంగంలోకి తీసుకురావడం కొత్త విషయం ఏమీ కాదు. తరాలుగా కొనసాగుతున్నదే. అయితే.. చిత్ర పరిశ్రమలో టాప్ సెలబ్రిటీలుగా ఉన్నవారి వారసులకు ఎంట్రీపాస్ చాలా ఈజీగా లభిస్తుంది. కానీ.. మిగిలిన వారికి అంత ఈజీకాదు. అయితే.. కష్టపడి ప్రయత్నించినా అడ్డుకోవడానికి కొన్ని శక్తులు సిద్ధంగా ఉంటాయని అంటున్నారు ప్రముఖ నటుడు గిరిబాబు!
తన కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సిద్ధమైన గిరిబాబు.. ‘ఇంద్రజిత్’ అనే సినిమా రూపొందించారు. అది కౌబాయ్ మూవీ. ఇది1990లోని ముచ్చట. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొదమ సింహం’ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విషయం ఏమంటే.. ఇది కూడా కౌబాయ్ సినిమానే. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావాల్సి ఉందట. కానీ.. అనివార్య కారణాలతో చిరంజీవి సినిమా మాత్రమే విడుదలైంది.
అయితే.. కథ, కథనంలో లోపం వల్ల ఆ సినిమా సరిగా ఆడలేదు. దీంతో.. చాలా మంది గిరిబాబు వద్ద నెగెటివ్ కామెంట్స్ చేసి భయపెట్టారట. ‘‘చిరంజీవి వంటి హీరో కౌబాయ్ గా చేసిన సినిమానే ఆడలేదు.. మీ సినిమా ఆడుతుందని ఎలా అనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించారట. దీంతో.. ఏం చేయాలో తెలియలేదట. కానీ.. ఇక్కడ రెండు సమస్యలున్నాయి.
ఆ రోజుల్లోనే రూ.40 లక్షలు పెట్టి సినిమా తీశాడట గిరిబాబు. పైగా హీరో తన కొడుకు. పెట్టిన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఒకటైతే.. కొడుకును హీరోగా పరిచయం అంతకన్నా ముఖ్యమైన అవసరం. అందుకే.. ఏదైతే అది అయ్యిందని.. ‘కొదమ సింహం’ విడుదలైన తర్వాత ‘ఇంద్రజిత్’ ను రిలీజ్ చేశారట.
చిరంజీవి సినిమానే ఆడలేదనే వంకతో రూ.20 లక్షలకే సినిమాను కొన్నారట బయ్యర్లు. కానీ.. సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందట. కానీ.. పనిగట్టుకొని కొందరు సినిమాపై బ్యాడ్ ప్రచారం మొదలు పెట్టారట. ఆయన కొడుకు కూడా సరిగా చేయలేదని కామెంట్స్ చేశారట. ఆ నెగెటివ్ ప్రచారం వల్లే తన కొడుకు హీరోగా ఎదగలేకపోయాడని, తర్వాత అతడికి అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గిరిబాబు.