సినీ.. నాటక రంగ ప్రముఖుడు గిరీశ్ కర్నాడ్ అంత్యక్రియలు ఈ రోజు జరిగాయి. ప్రముఖులు కొందరికి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించటం మామూలే. అయితే.. ఆయన తన అంత్యక్రియలు ఎలా ఉండాలన్న దానిపై కుటుంబ సభ్యులకు ముందే చెప్పటం.. ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదని చెప్పటం గమనార్హం.
గిరీశ్ కోరుకున్న విధంగా ఆయన అంతిమయాత్రను నిర్వహించాలని తాము భావిస్తున్నామని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేయటంతో.. ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల్ని ఏర్పాటు చేయలేదు. కేవలం కుటుంబ సభ్యులు.. సన్నిహితుల సంక్షంలో స్థానిక స్మశాన వాటికలో చాలా సాదాసీదాగా అంత్యక్రియలు నిర్వహించారు.
గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడిన కర్నాడ్.. సోమవారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. కర్నాడ్ కోరిక మీదట.. ఆయన అంతిమయాత్ర సందర్భంగా పోలీసులను కూడా ఏర్పాటు చేయొద్దని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. అభిమానుల సందర్శనార్థం కూడా భౌతికకాయాన్ని ఉంచలేదు. అంతిమయాత్ర సమయంలో పోలీసు బలగాలు.. అభిమానులు వెంట రావొద్దని ఆయన కోరుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. చాలా కొద్ది మంది సమక్షంలో ఆయన అంతిమయాత్ర పూర్తి అయ్యింది.