కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి.. నిర్మాత బన్నీ వాసు సూపర్ ఐడియా..!

Update: 2023-01-10 11:37 GMT
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు స్మాల్ బడ్జెట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా కిరణ్ అబ్బవరం హీరోగా ఆయన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తీశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సినిమా రిలీజ్ విషయంపై కొన్నాళ్లుగా జరుగుతున్న విషయాల పట్ల తన స్పందన తెలియచేశారు బన్నీ వాసు. నాకు ఈమధ్య ఒక ఆలోచన వచ్చిందని. ఏడాదికి 200 సినిమాలు పైగా రిలీజ్ అవుతున్న టాలీవుడ్ లో ఏడాది మొత్తం ఉన్న 54 వారాల్లో కొత్త వాళ్లకు ఒక 3 వారాలు ఛాన్స్ ఇవ్వమని అన్నారు.

కొత్త నిర్మాతలు.. కొత్త దర్శకులు.. కొత్త హీరోలు ఇలా కొత్త టీం అంతా కలిసి ప్రయత్నాలు చేస్తారని వారికి సరైన రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల సినిమాలు సరైన విధంగా ఆడట్లేదని అన్నారు. ఏడాదికి 200 పైగా రిలీజ్ అవుతున్న ఈ టైం లో సూపర్ హిట్ అయ్యే సినిమాలు కేవలం 10 మాత్రమే ఉంటున్నాయి. ఆడని సినిమాలు ఒక 100 ఉంటున్నాయి. మధ్యలో సినిమాలన్ని యావరేజ్ టు ఎబో యావరేజ్ గా ఉంటున్నాయని.. వారికి సినిమా రిలీజ్ సరైన టైం లో చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

బన్నీ వాసు చెప్పిన దానిలో నిజం ఉందని చెప్పొచ్చు. కానీ హాలీడేస్ వీక్ వస్తే చాలు స్టార్ సినిమాలన్ని వరుస కడతాయి. ఒక స్టార్ హీరో సినిమాకే మరో స్టార్ హీరో సినిమా పోటీకి వస్తుంటే చిన్న సినిమాలకు అసలు ఛాన్స్ ఇవ్వరని చెప్పొచ్చు.

అయితే బన్నీ వాసు కోరినట్టుగా చిన్న సినిమాలకు హాలీడేస్ వీకెండ్ రిలీజ్ ఛాన్స్ ఇస్తే మాత్రం తప్పకుండా సినిమాలు మంచి ఫలితాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇక వినరో భాగ్యము విష్ణు కథ సినిమా విషయానికి వస్తే తిరుపతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ సరసన కశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను మురళి కిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నారు.

సినిమా టీజర్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకోగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ డేట్ నాడు కూడా శాకుంతలం తో పాటుగా విశ్వక్ సేన్ ధంకీ కూడా వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News