RRRలో గ్లాడియేట‌ర్‌ పులిని దించారా?

Update: 2019-09-09 15:01 GMT
అప్ప‌ట్లో `లైఫ్ ఆఫ్ పై` సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఆంగ్ లీ గ్రాఫిక్స్ లో పెద్ద‌ పులిని సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ లు కొల్ల‌గొట్టిన చిత్ర‌మిది. సినిమా ఆద్యంతం ఆ పులిదే ప్ర‌ధాన పాత్ర‌. అయితే అంత పెద్ద పాత్ర కాదు కానీ.. అదే త‌ర‌హాలో యానిమేష‌న్స్ -విజువ‌ల్ గ్రాఫిక్స్ సాయంతో ఓ పెద్ద పులిని క్రియేట్ చేసి తెర‌పై బ్లో అనిపించేలా చేయ‌బోతున్నార‌ట ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్. రాజమౌళి.

అయితే ఈ పులితో ఫైట్ చేసేది ఎవ‌రు? అల్లూరి సీతారామ‌రాజునా లేక కొమ‌రం భీమ్ నా? అంటే అది ఇప్ప‌టికి స‌స్పెన్స్. గిరిజ‌న వీరుడు కొమ‌రం భీమ్- మ‌న్యం వీరుడు అల్లూరితో క‌లిశాక ఆ ఇద్ద‌రూ క‌లిసి పులితో పోరాడ‌తార‌ని స్పెక్యులేష‌న్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బ‌ల్గేరియాలో చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నారు. అక్క‌డే పులితో పోరాడే స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియ‌న్ల‌ను బ‌రిలో దించార‌ని చెబుతున్నారు.

జ‌క్క‌న్న ప్లాన్ చూస్తుంటే.. ఈసారి కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో గ‌ట్టిగానే ప్లాన్ చేశాడ‌ని అర్థ‌మ‌వుతోంది. పులుల‌తో పోరాటాలు అంటే గ్లాడియేట‌ర్ చిత్రంలో ర‌స్సెల్ క్రో గుర్తుకొస్తాడు. నాలుగు వైపుల నుంచి పులులు మీదికి ఉరుకుతుంటే శత్రువుతో పోరాడాలి. అక్క‌డ గ్రాఫిక్ పులినే ఉప‌యోగించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ లైఫ్ ఆఫ్ పై చిత్రంలో గ్రాపిక్స్ పులి అద్భుతంగా కుదిరింది. మ‌రి ఈసారి అల్లూరి- కొమ‌రం భీమ్  పులితో పోరాటం అంటే ఆ లెవ‌ల్లోనే గ్రాఫిక్స్ పులిని క్రియేట్ చేస్తారేమో చూడాలి. బ్లూమ్యాట్- గ్రీన్ మ్యాట్ త‌ర‌హాలో పోరాట స‌న్నివేశాల్ని చిత్రీక‌రించి త‌ర్వాత గ్రాఫిక్స్ పులిని జాయింట్ చేస్తారు. అవి నిజ‌మైన పులితో త‌ల‌ప‌డిన‌ట్టే చూపిస్తార‌న్న‌ సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News