పొగరు దించిన అమ్మాయి.. సమంత వీడియో వైరల్
ఇక సమంత కొద్దీ సేపటి క్రితమే షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
సమంత సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా కూడా ఇటీవల ఇంటర్నెట్ వరల్డ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ ఆమె తండ్రిని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ బాధలో ఉన్న సమంత ప్రస్తుతం కుటుంబం సభ్యులతోనే సమయాన్ని గడుపుతోంది. బాలీవుడ్ ప్రాజెక్ట్ లు కొన్ని చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడైతే ఆమె షూటింగ్స్ కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక సమంత కొద్దీ సేపటి క్రితమే షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “ఫైట్ లైక్ ఏ గర్ల్” అనే క్యాప్షన్‌తో ఓ చిన్న వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక చిన్న అమ్మాయి రెస్లింగ్ మ్యాచ్‌లో అబ్బాయిపై గెలిచిన దృశ్యం ఉంది. ముందుగా షేక్ హ్యాండ్ ను పొగరుతో ఇచ్చిన అబ్బాయిపై ఆమె గెలిచింది. అనంతరం ఆ పిల్లవాడు ఏడవడం అందులో ఉంది. ఇక సామ్ ఈ టైమ్ లో ఆ తరహా వీడియో షేర్ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారింది.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహానికి కొన్ని గంటల ముందు సమంత ఈ పోస్ట్ చేయడం వివాదస్పదంగా మారింది. ఆమె సందేశం గురించి నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చైతూ, శోభిత వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. ఈ స్టూడియో 1976లో నాగచైతన్య తాత, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్థాపించారు. చైతూ ఈ ప్రత్యేక రోజుకు తన తాతను గౌరవిస్తూ సంప్రదాయ వేషధారణలో కనిపించనున్నారని సమాచారం.
చైతన్య, శోభిత లవ్ స్టోరీ గురించి నాగార్జున గతంలో పంచుకున్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. “గూఢచారి” చిత్రంలో శోభిత నటన చూసి ఇంప్రెస్ అయిన నాగ్, ఆమెను హైదరాబాద్‌లోని తన ఇంటికి ఆహ్వానించారు. అప్పుడే చైతన్య, శోభిత మొదటిసారి కలుసుకున్నారని నాగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వారి పెళ్లి సమయం రాత్రి 8:15కి నిర్ణయించబడింది. వెడ్డింగ్ వేడుకలు 8 గంటల పాటు కొనసాగనున్నాయి.
శోభిత ఈ ప్రత్యేకమైన రోజున కాంచీవరం పట్టు చీరలో కనిపించనుంది. ఆ చీరలో నిజమైన బంగారు కూడా ఉంటుందట. అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లోని పొండూరు నుంచి చేతివేసిన ఖాదీ చీరను చైతన్యకు మ్యాచ్ అయ్యేలా ఎంపిక చేశారు. ఇటీవల, వారి మంగళస్నానం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పద్దతులు వారి పెళ్లికి గట్టి హైలైట్ అవుతుండగా, సమంత పోస్ట్ చేసిన “ఫైట్ లైక్ ఏ గర్ల్” సందేశం కొత్త చర్చలకు దారితీసింది.
సాధారణంగా సమంత అప్పుడప్పుడు మహిళలకు సపోర్ట్ చేసే విధంగా అనేక రకాల సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఆమె ఒక అబ్బాయి పొగరును అమ్మాయి తన విజయంతో దీంచేసింది అనేలా మరో సందేశం ఇచ్చినట్లు అర్ధమవుతుంది. ఇక సామ్ షేర్ చేసిన ఈ వీడియో ఎప్పటిలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.