బ‌న్ని ద్విభాషా చిత్రం క్లూ ఇదే!

Update: 2018-09-28 07:19 GMT
నా పేరు సూర్య` త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్. డిజాస్ట‌ర్ ఫ‌లితం చాలానే ఆలోచించుకునేలా చేసింది. గ‌త కొంత‌కాలంగా విక్ర‌మ్‌.కె.కుమార్ స్క్రిప్టు కోసం కుస్తీ ప‌డుతున్నా ఒక ప‌ట్టాన అది ఫైన‌ల్ కావ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే త్రివిక్ర‌మ్ వినిపించే స్క్రిప్టును బ‌న్ని ఫైన‌ల్ చేసే ఛాన్సుంద‌ని వార్త‌లొచ్చాయి. ఆ క్ర‌మంలోనే అత‌డికి సంబంధించిన వేరొక భారీ ప్రాజెక్టుకు సంబంధించిన క్లూ ఒక‌టి లీకైంది.

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా స్టూడియోగ్రీన్ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ ఓ భారీ చిత్రం నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. ఆ మేర‌కు `నోటా` ప్ర‌మోష‌న్స్‌ లో జ్ఞాన‌వేల్ రాజా ఓ హింట్ కూడా ఇవ్వ‌డం ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అయితే అది ద్విభాషా చిత్ర‌మా?  లేక కేవ‌లం తెలుగులోనే నిర్మిస్తామా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌ను. ఆ ఛాయిస్ ద‌ర్శ‌కుడికే వ‌దిలేస్తున్నాన‌ని జ్ఞాన‌వేల్ ప్ర‌స్థావించారు. త‌మిళ స్టార్ హీరోలు సూర్య‌ - కార్తీల‌తో భారీ చిత్రాలు నిర్మిస్తున్న స్టూడియోగ్రీన్ అధినేత ప్ర‌స్తుతం తెలుగు - త‌మిళ్ ద్విభాషా చిత్రాల‌పై దృష్టి సారించారు. ఆ క్ర‌మంలోనే రెండు మార్కెట్ల‌ను కొల్ల‌గొట్టే స‌త్తా ఉన్న స్టార్ల కోసం వెతుకుతున్నారు.

అంతేకాదు.. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా తెలుగు- త‌మిళ్ స్టార్ల‌ను ఒకే గొడుగుకింద‌కు తెచ్చి - భారీ మ‌ల్టీస్టార‌ర్ల‌ను రూపొందించే స‌న్నాహాల్లో ఉన్నారు. ప్ర‌స్తుతం దేవ‌ర‌కొండ‌ను నోటా చిత్రంతో త‌మిళ్‌లోనూ ప‌రిచ‌యం చేస్తూ వేడి పెంచారు. త‌దుప‌రి సూర్య ప్రాజెక్ట్ కోసం అత‌డిని లాక్ చేయ‌డం ఇటీవ‌ల ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. ఈ మ‌ల్టీస్టార‌ర్‌ తో పాటు - అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా ద్విభాషా చిత్రానికి స‌న్నాహాలు చేయ‌డం ఇరు ప‌రిశ్ర‌మ‌ల్లో వేడి పెంచుతోంది. ఇక‌పోతే గీతా ఆర్ట్స్‌తో జ్ఞాన‌వేల్ రిలేష‌న్‌ షిప్ ఈనాటిది కాదు. సూర్య `గ‌జిని` చిత్రం నుంచి బాస్ అల్లు అర‌వింద్‌ కి జ్ఞాన‌వేల్ స‌న్నిహితుడు. ఆ క్ర‌మంలోనే బ‌న్నితో ప్రాజెక్ట్ పెద్ద స్థాయిలోనే ఉండే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. అయితే అన్నిటినీ క‌థ‌ - ద‌ర్శ‌కుడు డిసైడ్ చేసే ఛాన్సుంది. బ‌న్ని ప్ర‌స్తుతం స‌రైన స్క్రిప్టు కోసం - ద‌ర్శ‌కుడి కోసం అన్వేష‌ణ‌లో ఉన్నాడన్న‌ది ఖాయంగా తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈసారి స్టూడియోగ్రీన్ అధినేత ఏ ద‌ర్శ‌కుడిని బ‌న్ని కోసం బ‌రిలో దించుతున్నారు? అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఎలానూ విక్ర‌మ్‌.కెతో క‌థ ఓకే కాలేదు కాబ‌ట్టి లింగుస్వామి లేదా ఇంకెవ‌రైనా వేరొక ద‌ర్శ‌కుడితో ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది చూడాల్సి ఉందింకా. బ‌న్ని కోసం లింగుస్వామి లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్క్రిప్టు ప‌ట్టుకుని తిరిగినా ప‌న‌వ్వ‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లుమార్లు లింగుస్వామి బ‌న్నికి క‌థ చెప్పినా అది ఓకే కాలేదు. ఆ క్ర‌మంలోనే బ‌న్ని క్యూలో ఎవ‌రున్నారు? అన్న‌ది ఇంకా తేలాల్సి ఉంది. ఇక స్టూడియోగ్రీన్ సంస్థ జీఏ2 సంస్థ నిర్మించిన‌ `గీత గోవిందం` చిత్రాన్ని త‌మిళంలో రిలీజ్‌ చేసింది. కేవ‌లం 20ల‌క్ష‌ల‌కు త‌మిళ రిలీజ్ హ‌క్కులు ఛేజిక్కించుకుని 3 కోట్ల మేర ఆర్జించ‌డం త‌మిళ‌నాట ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది.
Tags:    

Similar News