వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మూవీ ‘‘యే దిల్ హై ముష్కిల్’’. పుట్టెడు వివాదాలతో అసలు ఆ మూవీ రిలీజ్ అవుతుందా? లేదా? అన్న సందేహం కలిగిన పరిస్థితి. పాకిస్థానీ నటుడు నటించిన ఆ సినిమా విడుదలను ఎలా అయినా అడ్డుకుంటామన్న హెచ్చరికల నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కిందామీదా పడి మరీ.. సినిమాను ఎట్టకేలకు విడుదల చేశారు.
అయితే.. సినిమాలో ఉన్న ఒక డైలాగ్ ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీని అవమానించేలా ఉందన్న వివాదం ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. గోవా డీజీపీ ముఖేష్ చందర్ ఈ సినిమాను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఒక రాష్ట్ర డీజీపీ ఏకంగా సినిమాను చూడొద్దంటూ పిలుపునివ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. నాలుగు రోజుల వ్యవధిలో వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమాను ఆయన ఎందుకు చూడొద్దంటున్నారన్న సంగతిలోకి వెళితే.. మహ్మద్ రఫీని కించపరిచేలా ఒక డైలాగ్ ఉన్న విషయాన్ని ఆయన చెబుతున్నారు.
ఈ సినిమాలో రణబీర్ కపూర్.. అనుష్క శర్మతో చెప్పిన డైలాగ్ ఇప్పుడు వివాదంగా మారింది. ‘‘మహ్మద్ రఫీ..? ఓ గాలే కమ్.. రోతే జ్యాదా తేనా..?(మహ్మద్ రఫీనా? పాడేది తక్కువ.. ఏడ్చేదే ఎక్కువ..?) అని చెప్పటంపై గోవా డీజీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/