మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ పాదర్ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా భారీ హైప్ ను కలిగి ఉంది. మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటంతో అన్ని విధాలుగా బిజినెస్ భారీగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుందట. ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ కి ఏకంగా రూ.57 కోట్లు నెట్ ఫ్లిక్స్ చెల్లించినట్లుగా సమాచారం అందుతోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కి ఉన్న క్రేజ్ ఏపాటిదో దీన్ని బట్టే అర్థం అవుతోంది. చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా మొదలు పెట్టకుండానే రేటు కుమ్మేసిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అక్కడ కూడా మంచి బిజినెస్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం సొంతంగా రిలీజ్ చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే సినిమా విడుదలకు ఇంకాస్త సమయం ఉండటం వల్ల ముందు ముందు ఏమైనా థియేట్రికల్ బిజినెస్ అయ్యేనా చూడాలి.
గాడ్ ఫాదర్ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ను దక్కించుకోవడం ద్వారా నెట్ ఫ్లిక్స్ వారు సౌత్ ఇండియాపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కి ఉత్తర భారతంలో ఉన్నంత మంది ఖాతాదారులు సౌత్ లో ఉండరు. కనుక గాడ్ ఫాదర్ సినిమా యొక్క క్రేజ్ తో నెట్ ఫ్లిక్స్ కి అక్కడ ఇక్కడ పాపులారిటీ పెరిగే అవకాశం ఉందంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.