చిరు మూవీ అక్క‌డ రికార్డులు సృష్టిస్తోంది!

Update: 2022-11-24 02:30 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా `గాడ్ ఫాద‌ర్‌`. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన `లూసీఫ‌ర్‌` ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీ అక్టోబ‌ర్ 5న దీపావళి సంద‌ర్భంగా విడుద‌లైంది. భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కీల‌క అతిథి పాత్ర‌లో, న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో పాటు పాజిటివ్ రివ్యూల‌ని ద‌క్కించుకున్నా ఆ త‌రువాత ఆ స్థాయిలో ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయింది.

థియేట్రిక‌ల్ బిజినెస్ ప‌రంగా రూ. 90 కోట్ల‌కు మించి జ‌రిగిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఫైన‌ల్ ర‌న్ లో రూ. 120 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిందే కానీ సూప‌ర్ హిట్ అనిపించుకోలేక పోయింది. పైగా ఈ వ‌సూళ్ల వ‌ల్ల డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మిగిలింది కూడా ఏమీ లేక‌పోవ‌డంతో సినిమాని ఫ్లాప్ గా తేల్చారు. స‌ల్మాన్ ఖాన్ అతిథి పాత్ర‌లో న‌టించినా కూడా ఫ‌లితం నెగెటివ్ గా రావ‌డంతో అంతా అవాక్క‌య్యారు. ఇదే స‌మ‌యంలో `కాంతారా` రిలీజ్ కావ‌డంతో `గాడ్ ఫాద‌ర్‌` గురించి ప‌ట్టించుకున్న వాళ్లే లేకుండా పోయారు.

దీంతో మెగా ఫ్యాన్స్ చాలా వ‌ర‌కు అసంతృప్తిని ఫీల‌య్యారు. బ్యాక్ టు బ్యాక్ ఆచార్య త‌రువాత `గాడ్ ఫాద‌ర్` కూడా ఇంచు మించి అదే ఫ‌లితాన్ని అందించ‌డంతో మెగా అభిమానుల్లో తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యారు. మ‌ల‌యాళ ఒరిజిన‌ల్ మూవీ తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ అప్ప‌టికే యూట్యూబ్ లోకి వ‌చ్చేయ‌డం, చాలా మంది చూసేయ‌డంతో `గాడ్ ఫాద‌ర్‌`ని చూడ‌టానికి ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌లేదు.  

తాజాగా ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేశారు. అక్క‌డ కూడా `ఆచార్య‌` త‌ర‌హా ఫ‌లిత‌మే ల‌భిస్తుంద‌ని అంతా భావించారు కానీ అంద‌రి అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేస్తూ `గాడ్ ఫాద‌ర్‌` తెలుగు వెర్ష‌న్ టాప్ 3లో హిందీ వెర్ష‌న్ టాప్ 1 లో ట్రెండ్ అవుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ప్ర‌స్తుతం వున్నక్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా నెట్ ఫ్లిక్స్ లో వున్న సినిమాల్లో ఓ వారం పాటు `గాడ్ ఫాద‌ర్‌` తెలుగు, హిందీ వెర్ష‌న్ లు టాప్ 10లో వుండే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. ఈ వార్త విని చిరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News