మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ షురూ అయింది. ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోన్న ఆ సమయం రానే వచ్చేసింది. మెగాస్టార్ పుట్టిన రోజుకి ఇంకా కొన్ని గంటలు సమయం ఉండగానే `గాడ్ ఫాదర్` టీజర్ తో ట్రీట్ షురూ చేసారు. కొద్ది సేపటి క్రితమే టీజర్ రిలీజ్అ యింది. ఓసారి టీజర్ లోకి వెళ్తే... మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలవ్వగా..మెగాస్టార్ వాయిస్ తో ముగుస్తుంది.
``20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడెన్ గా తిరిగొచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు` అని రాహుల్ శర్మ అంటారు. ``ఇక్కడికి ఎరొచ్చినా? రాకపోయినా? నేను పట్టించుకోను. కానీ అతను మాత్రం రాకూడదంటూ`` నయన్ ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. `డూ యూ నో హూ ఈజ్`.. ``హీ ఈజ్ ద బాస్ ఆఫ్ ది బాసెస్``..``అవర్ ఒన్ అండ్ ఓన్లీ గాడ్ ఫాదర్`` అంటూ టీజర్ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ హైలైట్. ``లప్తా బడీ రౌడీ ప్లానింగ్ చల్ రఈయే.. అప్నే చోటీ భాయ్ కో బోల్ నా నయియే` అంటూ మెగాస్టార్ చెప్పిన హిందీ డైలాగ్ తో ఫ్యాన్స్ లో పునకాలు తెప్పించడం ఖాయం.
మెగాస్టార్ మాసివ్ ఎంట్రీ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. టీజర్ తోనే అంచనాలు రెట్టింపు చేసారు. చిరు ఎంట్రీ నుంచి టీజర్ ముగింపులో సల్మాన్ ఎంట్రీ వరకూ ఆద్యంతం రక్తి కట్టించింది. సల్మాన్ గెస్ట్ అప్పీరియన్స్ ని సైతం టీజర్ లో రివీల్ చేసారు. చిరు-నయన్ పాత్రల మధ్య బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. ఆ రెండు పాత్రలు సహా చిరు గతం ఆసక్తికరమే. చిరు ఆహార్యంలో సైతం ఎంతో వైవిథ్యత కనిపిస్తుంది. నెరిసిన తల..గడ్డం లుక్ లో మెగాస్టార్ ని కొత్తగా ఆవిష్కరించారు. థమన్ ఆర్ ఆర్ తో మరోసారి సత్తా చాటారు. టీజర్ నే ఈ రేంజ్లో దించారంటే? ట్రైలర్ ఇంకే స్థాయిలో? ఉంటుందంటూ ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ ఖాయం.
`గాడ్ ఫాదర్` మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన `లూసీఫర్` కి రీమేక్ గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాతృకకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్-సూపర్ గుడ్ పిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Full View