పాపులర్ యాంకర్, టీవీ వ్యాఖ్యాత సుమ కనకాల చాలా గ్యాప్ తర్వాత నటించిన పూర్తి స్థాయి సినిమా ''జయమ్మ పంచాయితీ''. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. సమ్మర్ కానుకగా మే 6న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం తాజాగా 'గొలుసుకట్టు గోసలు' అనే పాటను విడుదల చేశారు. 'కలిసి బతికే కాలమే మాయే.. నేడే.. పగటి వేళే పీడకలలాయే.. అలసిపోని ఆశలే మాయే.. అయ్యో.. గొలుసు కట్టు గోసలైపోయే..' అంటూ సాగిన ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది.
జయమ్మ పంచాయతీ ఎంతకూ తేలడం లేదంటూ ఆమె బాధలను విచారాన్ని తెలియజెప్పే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంది. ఇది సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని సూచిస్తుంది. ఇన్నాళ్లు స్టేజీపై అందరినీ నవ్విస్తూ చలాకీగా ఉండే సుమ.. ఈ సాంగ్ తో భావోద్వేగానికి గురి చేస్తోంది.
'గొలుసు కట్టు గోసలు' గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యం అందించగా.. కీరవాణితో కలిసి సింగర్ చారు హరి హరన్ వినసొంపుగా ఆలపించారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేశారు. ధను అంధ్లూరి ఈ విలేజ్ డ్రామాకి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
'జయమ్మ పంచాయితీ' సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన సుమ పోస్టర్స్ - టీజర్.. ఇటీవల పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ఉద్వేగభరితమైన గొలుసు కట్టు గీతం ఆకట్టుకుంది.
విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో దేవి ప్రసాద్ - దినేష్ కుమార్ కదంబాల - షాలిని కొండేపూడి - నికితా గణేష్ యాదవ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
దాదాపు రెండున్న దశాబ్దాలుగా అటు యాంకర్ గా బుల్లితెరపై, ఇటు హోస్టుగా సినిమా ఈవెంట్స్ లో హవా కొనసాగిస్తున్న సుమ.. 'జయమ్మ పంచాయితీ' చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Full View