పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దర్శకత్వం చేసే ఛాన్స్ ఏ దర్శకుడు కైనా వస్తే కచ్చితంగా వదులుకోడు. చాలామంది దర్శకులు పవన్ కళ్యాణ్ తో కెరియర్ లో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం నటుడు దర్శకుడు అయిన సముద్రఖనికి వచ్చింది. దర్శకుడుగా కెరియర్ ప్రారంభించిన సముద్రఖని తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో ప్రతి నాయకుడుగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు.
ఆయనను దృష్టిలో పెట్టుకొని దర్శకులు విలన్ పాత్రలను డిజైన్ చేస్తూ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న సినిమాలో కూడా సముద్రఖని ప్రతి నాయకుడుగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సార్ సినిమాలో కూడా మెయిన్ విలన్ గా సముద్రఖని నటించారు. ఇదిలా ఉంటే తాజాగా సముద్రఖని నటనకు కొంత విరామం ఇచ్చి దర్శకుడుగా పవన్ కళ్యాణ్ తో వినోదాయ సీతమ్ మూవీ రీమేక్ చేస్తున్నారు.
తమిళంలో సముద్రఖని స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమానే వినోదాయ సీతమ్. అందులో సముద్రఖని చేసిన దేవుడు పాత్రలోనే పవన్ కళ్యాణ్ తెలుగులో కనిపించబోతున్నాడు. మరో లీడ్ రోల్ లో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. మామ అల్లుళ్ళను ఒకేసారి స్క్రీన్ పై చూసే అవకాశం మెగా ఫ్యాన్స్ కి ఈ సినిమాతో రాబోతుంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలో నెలకొని ఉన్నాయి. ఇక సముద్రఖని కూడా ఈ మూవీతో దర్శకుడుగా టాలీవుడ్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. గతంలో శంభో శివ శంభో సినిమాని సముద్రఖని తెలుగులో రీమేక్ చేశారు.
అది కూడా తమిళంలో అతని దర్శకత్వంలో వచ్చిన మూవీనే. అయితే శంభో శివ శంభో తెలుగులో అనుకొన్న స్థాయిలో ప్రేక్షకులు రీచ్ కాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం నటుడుగా కొంత గ్యాప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పెద్ద స్టార్స్ సినిమాలకు ఆయన నో చెప్పినట్లుగా తెలుస్తుంది. దర్శకుడిగా సినిమా చేయడం వల్ల ఇప్పుడు ఆయనను దృష్టిలో పెట్టుకొని కథలు రాసే దర్శకులకు క్యారెక్టర్ విషయంలో ఇంకొకర్ని రీప్లేస్ చేయడం కొద్దిగా కష్టతరం అవుతుందని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.